శృంగార జీవితంగా ఆనందంగా సాగితే.. వారి వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. కాగా.. శృంగారం రుచి చూసిన వారికీ.. రుచి చూడని వారికీ.. ఈ విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి.
అసలు సెక్స్ గురించి తెలియని వారికి కొన్ని అనుమానాలు ఉన్నట్లే.. శృంగారాన్ని రుచి చూసిన వారికి కొన్ని అపోహలు ఉంటాయి. కాగా.. అలాంటి వారి కోసం.. కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. అంగస్తంభన.. ఈ విషయంలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే.. చాలా మంది పోర్న్ చూసే అలవాటు ఉండొచ్చు. అందులో చూసినదే నిజమని నమ్ముతారు. అందులో నటించేవాళ్లు.. చాలా సేపు అంగస్తంభన కాకుండా ఉండగలుగుతారు. నిజ జీవితంలో అలా ఉండదు అన్న విషయం తెలుసుకోవాలి. నిపుణులు చెబుతున్న ప్రకారం.. దాదాపు పురుషులు మూడు నుంచి 5 నిమిషాలలో స్ఖలనం చేసేస్తారు. ఆ విషయం తెలియక తమను సుఖపెట్టడం లేదని స్త్రీలు.. తాము సుఖపెట్టలేకపోతున్నామని పురుషులు బాధపడకూడదు.
2.ఫోర్ ప్లే.. చాలా మంది పడకగదిలోకి వెళ్లాక కేవలం శృంగారం మీద మాత్రమే దృష్టిపెడతారు. అయితే... ఫోర్ ప్లే కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఫోర్ ప్లే తోనే మీరు అవతలి వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నారనే విషయం తెలుస్తుంది.
3.తొలి కలయిక.. చాలా మంది తొలి కలయిక రోజు ఇరగదీసేయాలని.. తమ పార్ట్ నర్ ని విపరీతంగా సుఖ పెట్టేయాలని ఏవేవో కలలు కంటారు. అయితే.. తొలి కలయిక ఎవరికీ పెద్దగా సక్సెస్ అవ్వదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. అది తొలిసారి కావడం పట్ల కొన్ని భయాలు ఉంటాయి. ఒకవేళ సక్సెస్ అయితే మంచిదే.. అవ్వకపోయినా ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
4.డబల్ రక్షణ.. సురక్షిత శృంగారానికి కండోమ్ చాలా అవసరం. అయితే.. కండోమ్ ధరించినప్పటికీ.. అది చిరిగిపోయి గర్భం వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అని రెండు కండోమ్స్ వేసుకోవడం మాత్రం పొరపాటు అని..అ లా చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
5.రెండో కండోమ్స్ ధరించే డబల్ రక్షణ కలుగుతందనే భ్రమపడుతుంటారు. దాని వల్ల రక్షణ పక్కన పెడితే.. కండోమ్ స్త్రీ అంగంలోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు.
6.అంగం సైజు.. అంగం సైజు పెద్దగా ఉంటేనే శృంగారం ఆస్వాదించగలమనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే.. అది పొరపాటు అని నిపుణులు చెబుతున్నారు.
7.శృంగారంలో పాల్గొనే సమయంలో మనకు తెలీకుండానే అంగం గట్టిపడటం.. సాధారణ స్థాయి కన్నా పెద్దదిగా మారడం జరుగుతుంది. సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరిదైనా చిన్నగానే ఉంటుంది.
8.చాలా మంది కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొని.. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అవి చాలా తప్పు అని.. అనారోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
9.హస్త ప్రయోగం అనారోగ్యానికి దారి తీస్తుందని కొందరు అపోహ పడుతుంటారు. అందులోనూ నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.