హనీమూన్... పగలు ప్రియురాలితో, రాత్రి భార్యతో రొమాన్స్.. చివరకు..

First Published | Jul 9, 2020, 12:42 PM IST

వీకెండ్ రెండు రోజులు భార్య వద్ద ఉండి.. మళ్లీ సోమవారం వెళ్లిపోయేవాడు. గత కొద్ది రోజులుగా అలానే చేస్తున్నాడు.
 

అతనికి ఇటీవలే పెళ్లి అయ్యింది. ఓ నెల రోజులపాటు భార్యతో ఆనందంగానే ఉన్నాడు. ఆ తర్వాత హనీమూన్ కి తీసుకువెళ్లాడు. ఆనందంగా ఇంటికి తిరిగివచ్చారు. అంత బాగానే ఉంది కదా అనుకునేలోపు ఆమెకు నమ్మలేని నిజం తెలిసింది.
హనీమూన్ కి తన భర్తతో పాటు.. తాను మాత్రమే కాదని.. మరో అమ్మాయి కూడా వచ్చిందని ఆమెకు తెలిసి షాకయ్యింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బళ్లారికి చెందిన మంజునాథ్ సండూరులో పనిచేసేవాడు. అతనికి ఈ ఏడాది మొదట్లో పెళ్లయ్యింది. యువతిది బెంగళూరు(21) కాగా.. ఆమె తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి జరిపించారు.
ఆ తర్వాత భార్యతో కలిసి హనీమూన్ కి ఊటీకి వెళ్లాడు. అక్కడ భార్య కన్నా ముందే.. మరో యువతికి అతను రూమ్ బుక్ చేయడం గమనార్హం.
భార్యను గదిలోపలే ఉంచేవాడు. ఆఫీసు పనిమీద వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయేవాడు. అనంతరం మరో గదిలో ఉన్న ప్రియురాలితో కలిసి బయటకు షికారుకు వెళ్లేవాడు.
ప్రియురాలితో పగలంతా రొమాన్స్ చేసి.. సాయంత్రానికి హోటల్ గదికి వచ్చేవాడు. రాత్రి పూట మాత్రం భార్యతో ఎంజాయ్ చేసేవాడు.
హనీమూన్ నుంచి వచ్చేసిన తర్వాత భార్యను మళ్లీ పుట్టింట్లో వదిలిపెట్టాడు. అయితే.. ఒకసారి వీకెండ్ లో వచ్చిన భర్త ఫోన్ ని సదరు యువతి చెక్ చేయగా.. ఆమెకు షాకింగ్ న్యూస్ తెలిసింది.
తన భర్తతో మరో యువతి సెల్ఫీలు ఆ ఫోన్ లో ఉన్నాయి. అది కూడా.. అసభ్యరీతిలో ఉండటంతో.. ఆమె షాకయ్యింది. కాగా.. ఆ ఫోటోలన్నీ... ఊటీలోనే దిగినట్లు ఉండటం చూసి ఆమె కంగుతిన్నది.
ఇదే విషయమై ఆమె భర్తను నిలదీయగా.. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒక్క ముక్కలో చెప్పి వెళ్లిపోయాడు.
తనకు రూ.25లక్షలు ఇస్తేనే.. తన భార్యగా ఉంటావని.. లేదంటే నీకు నాకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు.
దీంతో విస్తుపోయిన యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

click me!