మగవారి సామర్థ్యాన్ని పెంచే వెల్లుల్లి పాలు గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. వెల్లుల్లి పాలు ఎలా చెయ్యాలంటే?

First Published Oct 14, 2021, 3:55 PM IST


వెల్లుల్లిలో శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిని చట్నీ (garlic chutney), పప్పు, తాలింపు వంటి వాటిలో నిత్యం వాడుతుంటాం. 

వెల్లుల్లిలో శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిని చట్నీ (garlic chutney), పప్పు, తాలింపు వంటి వాటిలో నిత్యం వాడుతుంటాం. వెల్లుల్లి (garlic milk)గుండె పనితీరు, కొలెస్ట్రాల్ తగ్గించుటకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
 

వెల్లుల్లిలో (garlic) శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్, చక్కెరలు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి ఉన్నాయి. ప్రతిరోజు మనం వెల్లుల్లిని తీసుకొనుట వలన రోగనిరోధక శక్తి (immunity) పెరుగుతుంది. అలాగే పాలలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. పాలు శరీరానికి కావలసిన క్యాల్షియం ను అందించి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
 

వెల్లుల్లిని పాలల్లో కలిపి తీసుకుంటే మగవారిలో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, వెల్లుల్లి పాల (garlic milk) తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకొని బాగా మరిగించాలి మరుగుతున్న పాలలో ఒక స్పూన్ వెల్లుల్లి (garlic) ముక్కలు వేసి బాగా ఉడికించాలి.
 

ఒక గ్లాస్ లో పాలను తీసుకుని తేనే వేసుకుని తాగాలి.. ఈ వెల్లుల్లి పాలను (garlic Milk)రాత్రి నిద్రపోయేముందు తాగడం మంచి ఫలితాలను ఇస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే షుగర్ వ్యాధి (diabetic) ఉన్నవారు ఈ పాలను తేనే లేకుండా తాగాల్సి ఉంది.
 

వెల్లుల్లిపాయలను (garlic) ముఖ్యంగా మగవారు రాత్రి వేళల్లో తీసుకొనుట వలన వారిలో లైంగిక సమస్యలు తగ్గుతాయి. వారి వీర్యకణాల సంఖ్యను పెంచి వాటి కదలికలు ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. స్త్రీలలో హార్మోన్ లను బ్యాలెన్స్ గా ఉంచి (Harmon imbalance) , సంతాన వృద్ధిని పెంచుతాయి.
 

బాలింతలు ఈ పాలను సేవించుటవలన బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయి. రక్తంలో  కొలెస్ట్రాల్ ను తగ్గిస్థాయి. రాత్రి వేళ ఈ పాలను తీసుకోవడం వల్ల నిద్ర పడుతుంది. పాలు, వెల్లుల్లి (Milk, Garlic) కలిపి తీసుకోవడం వలన శరీరంలో మంటను తగ్గిస్తుంది.
 

వెల్లుల్లి పాలు సయాటికా, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, నడుము నొప్పి (Back Pain), దీర్ఘకాలిక జ్వరం (Fever) సహా అనేక రకాల వ్యాధులకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది.

click me!