పెళ్లైన ప్రతి మహిళ.. తల్లి కావాలని ఆశ పడుతుంది. కొందరికి ఆ వరం వెంటనే లభిస్తుంది. కానీ.. కొందరికి మాత్రం ఎన్ని సంవత్సరాలు ఎదురుచూసినా.. ఆ వరం లభించదు. దానికి పురుషుల్లో వీర్య కణాల సంఖ్య సరిగా లేకపోవడం కూడా ఒక కారణమేనని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి, మద్యం సేవించడం, పొగ తాగడం, జీవన శైలిలో మార్పులు ఇలా తదితర కారణాల వల్ల పురుషుల్లో వీర్యం తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు.
undefined
దీనికి చికిత్స దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కేవలం కొన్ని రకాల ఆహారాలను మీ జీవితంలో భాగం చేసుకుంటే.. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచిస్తున్నారు. వీర్య వృద్ధి బాగా పెరుగుతుందని చెబుతున్నారు.
undefined
పళ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలతో కూడిన మెడిటరేనియన్ డైట్‌తో వీర్యం నాణ్యత పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న సంతానలేమి సమస్యకు ఈ ఆహారం కొంతమేర పరిష్కారం చూపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ రోవిరా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
undefined
అంతర్జాతీయంగా ప్రస్తుతం 15 శాతం దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారని వారు తెలిపారు. ఈ తరహా కేసుల్లో ప్రధాన కారణం మగవారేనని, 25 శాతం కేసుల్లో వీర్యం నాణ్యత లోపం వల్లే పిల్లలు పుట్టడంలేదని వైద్య నివేదికలలో వెల్లడైందని చెప్పారు.
undefined
ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని, ఇందుకు మెడిటరేనియన్ డైట్ తోడ్పడుతుందని సూచించారు.
undefined
అంతేకాకుండా.. నట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వీర్యాభివృద్ధి బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
కేవలం 14 వారాలపాటు వరసగా నట్స్ తీసుకున్నా కూడా.. వీర్యం బాగా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. 72 మంది పురుషులపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
undefined
వారిలో కొందరికి వెస్ట్రన్ స్టైల్ ఆహారాన్ని అందజేశారు. మరీ ముఖ్యంగా రెడ్ మీట్, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇచ్చారు.
undefined
మరో 48మందికి మాత్రం 14 వారాలపాటు రోజుకి 60గ్రాముల చొప్పున నట్స్ ఇచ్చారు. కాగా.. నట్స్ తిన్న వారిలో వీర్యం బాగా వృద్ధి చెందినట్లు గుర్తించారు
undefined
గుమ్మడికాయ గింజల్లో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వీర్యం నాణ్యత పెరుగుతుందని.. అందుకే ప్రతి ఒక్కరూ గుమ్మడి గుంజలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.
undefined
డార్క్ చాక్లెట్ లో ఆమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. ఇవి కూడా వీర్యంలో నాణ్యత పెరగడానికి ఉపయోగపడతాయి.
undefined
విటమిన్ బి ఎక్కువగా ఉండే పాలకూర, మొలకలు లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. బత్తాయిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. టమాటలో సైతం విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు.. వీర్యం వృద్ధి చెందుతుంది.
undefined