దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, రొమాంటిక్ గా సాగిపోతే ఎంత బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఆచరణలోక వచ్చే సరికి అవన్నీ సాధ్యం కావడం చాలా మందికి కష్టంగా ఉంటుంది.
ఈ సమస్యలన్నింటికీ పడక గదిలోనే సమాధానం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు. ఏ సమస్య వచ్చినా భార్య, భర్తలు తమ మధ్య దూరం పెంచేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వారికే నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈమధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా వారికి ఎంతో మేలు జరిగేదని పరిశోధకులు చెబుతున్నారు.
శృంగారం కూడా ఒక వ్యాయామం లాంటిది.. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్ సంతరించుకుంటుంది. వారానికి మూడుసార్లు 15 నిమిషాలు వంతున శృంగారంలో పాల్గొంటే ఏడాదికి 7,500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75మైళ్ళు జాగింగ్ చేసినట్టే.
శృంగార సమయంలో అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. శృంగారంలో ప్రతిరోజు పాల్గొనడంవల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజూవారీ పనుల్లో చిరాకులను కూడా ఇది పూర్తిగా తొలగించి ప్రశాంతంగా ఉంచుతుంది.
శరీరంలోని టాక్సిన్స్ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్తప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది శృంగారం. దానిని ఆనందంగా ఆస్వాదిస్తే.. మరింత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చని.. ఆరోగ్యంగా కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.