దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!

First Published | Oct 17, 2021, 8:07 PM IST

ఇద్దరి మధ్య దాంపత్య జీవితం (Marital life) ఆనందంగా సాగాలంటే ఇద్దరూ కలిసి తమ వంతు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్త్రీ బంధంలో దగ్గరితనం కోరుకుంటారు. 

ఇద్దరి మధ్య దాంపత్య జీవితం (Marital life) ఆనందంగా సాగాలంటే ఇద్దరూ కలిసి తమ వంతు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్త్రీ బంధంలో దగ్గరితనం కోరుకుంటారు. పురుషుడు కొన్ని విషయాలలో తనను దూరంగా పెడుతూ, తనను పట్టించుకోకపోతే ఆమె బాగా నిరాశ (Disappointment) చెందుతుంది.
 

దీంతో మీ మీద అభిప్రాయ బేధాలు (Differences of opinion) ఏర్పడి మీ భాగస్వామి మీకు దూరమవుతూ ఉంటుంది. మీ భాగస్వామి మీకు అలా దూరమవుతునట్లు అనిపిస్తే మీరు కాస్త ప్రయత్నించి పరిస్థితులను (Problems) సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకీ అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Latest Videos


మీకు ఎన్నో టెన్షన్లు (Tensions) ఉండవచ్చు. ఆ టెన్షన్లను ఇంటికి వచ్చి భార్య మీద చూపించరాదు. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడుతుంది. తన భర్త ఇంటికి వచ్చాక తనతో ఆనందంగా, సంతోషంగా (Happy Moment) గడపాలని భావిస్తుంది.
 

కొంతమంది తమ మనసులో ఏమున్నా బయటపడరు (Will not come out) . జీవిత భాగస్వామి ఏమనుకుంటారో, ఎలా స్పందిస్తారోనని భావించి బయటకు చెప్పరు. దాంతో అవతలి వారి మనసులో ఏముందో తెలియక ఎవరికి వారే బతికేస్తారు. కానీ ఇది దాంపత్య జీవితానికి (Married life) మంచిది కాదు.
 

భాగస్వామికి వారు ఎంచుకున్న దారి సరైనదో కాదో వారికి తెలియజేయాలి. భార్య చేసే పని చిన్నదని, పెద్దదని ఆలోచించకూడదు (Thinking). తాను వేసే ప్రతి అడుగును ప్రోత్సహించాలి. భాగస్వామికి మీ ఇష్టాయిష్టాలను (Preferences) తెలియజేయాలి. అప్పుడే మీకు ఏ పని చేస్తే నచ్చుతుందో నచ్చదో తనకు తెలుస్తుంది.
 

దాంతో ఇద్దరి మధ్య అనుబంధం (Attachment bond) పెరుగుతుంది. మీ భాగస్వామి సుఖదుఃఖాలలో తనకు తోడుగా ఉండాలి. ఒక మంచి స్నేహితుడిగా (Friend) తన కష్టాలను పంచుకోవాలి. అప్పుడు ఎలాంటి కష్టాన్నైనా సునాయాసంగా దాటగలరు.అన్ని విషయాలలోనూ తనకు సపోర్టుగా ఉండాలి.

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తుల ముందు తనని తక్కువ చేసి మాట్లాడడం, తనకు సపోర్ట్ చేయకపోవడం (Lack of support) కూడా వారిని బాధిస్తుంది. మీ ఇద్దరి మధ్య బంధం ఎలా ఉన్నా సరే వేరే వ్యక్తుల ముందు తనని ఇబ్బంది పెట్టడం (Embarrassing) మంచిది కాదు.

మీపై ఆమెకు నమ్మకం గౌరవం ఉండేట్లు ప్రయత్నించాలి. చెడు అలవాట్లకు, చెడు సావాసాలకు (Bad habit's) దూరంగా ఉండండి. అంతేకాదు.. రిలేషన్ షిప్ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే వారికి అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, వేరే అమ్మాయిలతో బంధాన్ని కొనసాగించడం వంటివి చేయడం వల్ల మీ భాగస్వామిని బాధపెట్టడమే (Is to hurt) అవుతుంది.

click me!