శృంగారం అనేది ఓ మధురమైన అనుభూతి. దీనిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని అనుకుంటారు. ఇది ఒక శారీరక తృప్తి మాత్రమే కాదు. శృంగారం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వాస్తవానికి శృంగారం అనేది రోజుకు ఎన్నిసార్లు చేయాలి? ఏయే విధానాల్లో శృంగారం సురక్షితం వంటి ఎన్నో పరిశోధనలు సూచిస్తున్నాయి. అసలు జంటలు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి? ఈ విషయంలో సైన్స్ ఏమంటోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దాదాపు ఈ సృష్టిలో శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ ఉంటారు. జంటల్లో ఎవరైనా తన పార్టనర్‌తో ప్రతిరోజు శృంగారం చేసేలా ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే.. ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యకరమనే విషయంపై చాలాసార్లు చర్చలు జరిగాయి. తాజాగా.. దీనిపై నిపుణులు ఓ విషయాన్ని తెలియజేశారు.
పక్క వారికంటే తామే శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నామని భావిస్తే.. అలాంటి వారే మంచి లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలరట. ఇక ఎన్నిసార్లు కలయికను ఆస్వాదించాలి అంటే.. అది జంటలకే వదిలేస్తున్నారు.
రోజుకు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే వారిలో సాన్నిహిత్యం ఎక్కువగా ఉందని అర్థం కాదు.. అలా అని రోజుకు లేదా వారంలో తరచుగా కాకుండా అరుదుగా శృంగారంలో పాల్గొనే జంటల్లో సాన్నిహిత్యం సరిగా లేదని కాదని నిపుణులు చెబుతున్నారు.
శృంగారణ ప్రేరణ పొందాలంటే.. ముందుగా ప్రేమగా మాట్లాడుకోవడం రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా అది శృంగారానికి ప్రేరేపిస్తుంది. జంటల్లో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలంటే ప్రతి జంట తప్పనిసరిగా ముందు మాట్లాడుకోవాలి. ఒకరి మాటలను ఒకరు గౌరవించుకోవాలి అని చెబుతున్నారు.
శృంగారం చేయాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ జంటల్లో ఎవరికైనా సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకరికి కుదిరినా మరొకరు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో శృంగారంపై ఆసక్తి చూపలేకపోతారు.
అందుకే సరైన సమయం ఎప్పుడు దొరుకుతుందా? అని ఆలోచిస్తుంటారు. అందుకే ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఏయే సమయాల్లో, ఏయే ప్రదేశంలో శృంగారానికి అనుకూలంగా ఉంటుందో ముందుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందని సూచిస్తున్నారు.
శృంగారంలో అతి ముఖ్యమైన ఘట్టం.. ఫోర్ ప్లే.. ముద్దులు, కౌగిలింత, డర్టీ టాక్స్ మరింత సంతృప్తిని పొందేలా ప్రేరేపిస్తాయని అంటున్నారు. ఒకరినొకరు ఆకర్షించుకోవడం.. గౌరవించుకోవడం ద్వారా ఇరువురిలో శృంగారంపై ఆసక్తిని పెంచుతుందని తెలిపారు