కండోమ్ దేనితో తయారు చేస్తారో తెలుసా..?

First Published | Feb 12, 2021, 2:49 PM IST

పురాతన ఈజిప్షియన్ మరియు రోమన్ కాలంలో మేకలు, గొర్రెలు, పందుల మూత్రాశాయల నుంచి కండోమ్స్ తయారు చేసేవారట.

సురక్షిత శృంగారానికి కండోమ్ వాడతారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు సైతం కండోమ్ వాడండి అంటూ సూచిస్తున్నారు. కేవలం అవాంఛిత గర్భాన్ని ఆపడానికి మాత్రమే కాదు.. సుఖ వ్యాధులు రాకుండా కూడా ఇవి సహాయపడతాయి. అయితే.. ఈ కండోమ్స్ గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా..? అసలు ఈ కండోమ్స్ నిజంగా సురక్షితమేనా..?
అయితే.. ఈ కండోమ్ వాడకంలో కొందరు అబ్బాయిలు చాలా తప్పులు చేస్తున్నారు. దానిలో చాలా మంది కామన్ గా చేస్తున్న ఓ తప్పు విస్మయానికి గురిచేస్తోంది.

పంది పేగులను రీసైకిల్ చేసి కండోమ్ తయారు చేస్తారు. అంతేకాకుండా.. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు వేడి పాలతో శుభ్రం చేస్తారు.
పురాతన ఈజిప్షియన్ మరియు రోమన్ కాలంలో మేకలు, గొర్రెలు, పందుల మూత్రాశాయల నుంచి కండోమ్స్ తయారు చేసేవారట.
చైనా దీనిని తయారు చేయడానికి పట్టు కాగితపు పొరలను ఉపయోగించగా, జపాన్ తాబేలు గుండ్లు మరియు తోలును ఎంచుకుంది.
పారిశ్రామిక విప్లవం తరువాత, రబ్బరు తో తయారు చేసిన కండోమ్స్ వినియోగంలోకి వచ్చాయి.
1920ల కాలం నుంచి రబ్బర్ తో తయారు చేసిన కండోమ్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. తొలుత లాటెక్స్ కండోమ్ లను అమెరికాలోని ఓ రబ్బరు కంపెనీ తయారు చేసింది. వాటిని ఇప్పుడు ట్రోజన్ అని పిలుస్తున్నారు.
1932 లో, డ్యూరెక్స్ అనే లండన్ రబ్బరు సంస్థ ఐరోపాలో రబ్బరు కండోమ్లను విక్రయించింది.ప్రస్తుతం మాత్రం రకరకాల కండోమ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఫ్లేవర్స్ కూడా ఉండటం గమనార్హం.
జర్మనీకి చెందిన కండోమినియం సంస్థ కోకో పౌడర్‌తో శాకాహారి కండోమ్‌లను తయారు చేసింది.
కండోమ్‌లను విక్రయించే ముందు నాణ్యమైన తనిఖీ ఎలా చేయాలో మీకు తెలుసా? విద్యుత్ ప్రవాహం సహాయంతో కండోమ్ ఎక్కడైనా చినిగిందా లేదో చెక్ చేస్తారు.
కండోమ్ తయారు చేసిన తర్వాత 4 సంవత్సరాలు పనిచేస్తాయి. వాడిని పొడి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.
అంతేకాకుండా.. ఈ కండోమ్స్ వాడటం 97-98శాతం సురక్షితం.

Latest Videos

click me!