ఒకేసారి రెండు కండోమ్ లను యూజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 23, 2023, 4:27 PM IST

గర్భం దాల్చకుండా ఉండేందుకు చాలా జంటలు గర్భనిరోధకాలను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కండోమ్ లను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అయితే వీటి వాడకంపై చాలా మందికి ఎన్నో డౌట్లు ఉంటాయి. 
 

కండోమ్ వాడటం మంచిదేనా?

డాక్టర్లు, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కండోమ్ ల వాడకం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎన్నో అంటువ్యాధులు, ఇతర లైంగిక వ్యాధులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఇవి అన్ని రకాల గర్భనిరోధకాల కంటే బెటర్ గా ఉంటాయి. కండోమ్ లను ఉపయోగించడం వల్ల లైంగిక సంక్రమణ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. అలాగే అవాంఛిత గర్భం దాల్చే  అవకాశాలను కండోమ్లు తగ్గించడానికి కండోమ్ లు ఎంతో సహాయపడతాయనేది పూర్తిగా నిజం.

ఒకేసారి రెండు కండోమ్స్ వాడొచ్చా?

అయితే ప్రతి ఒక్కరూ గర్భనిరోధక సాధనాలను ఉపయోగించేటప్పుడు ఎలాంటి సమస్యలు రావొద్దని కోరుకుంటారు. అందుకే కొంతమంది ఒకేసారి రెండు కండోమ్స్ ను కూడా వాడేస్తుంటారు. కానీ శాస్త్రీయంగా ఇలా చేయండం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఒకేసారి రెండు కండోమ్స్ ను వాడితే రెండింటి మధ్య చాలా ఒత్తిడి, ఘర్షణ ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రెండూ చిరిగిపోతాయి. దీంతో వీటిని ఉపయోగించలేరు. 

Latest Videos


కండోమ్స్ వాడకం వల్ల లైంగిక ఉద్రేకం తగ్గుతుందా?

చాలా మంది కొనేండ్ల నుంచి కండోమ్స్ ను వాడుతుంటారు. ఇలాంటి వారికి దీనిపట్ల ఎన్నో అనుమానాలు కలుగుతాయి. అంటే కండోమ్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల లైంగిక కోరికలు, లైంగిక అనుభూతులు తగ్గుతాయని భావిస్తారు. 

condom

అయితే 2007లోనే ఇండియానా యూనివర్శిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో..  కండోమ్స్ ను వాడటం వల్ల ఎలాంటి లైంగిక సుఖాలు, భావోద్వేగాలు తగ్గవని తేలింది. కండోమ్స్ అవాంఛిత గర్భాన్ని నివారించడానికి, లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించడానికి మాత్రమే ఉపయోగపడతాయని గమనించాలి. వీటిని ఇందుకోసం మాత్రమే ఉపయోగిస్తారు.

click me!