స్ఖలనం ఆలస్యం కావడాన్నే బలహీనమైన స్ఖలనం అని కూడా అంటారు. అంటే దీనిలో తగినంత లైంగిక ఉద్దీపన, ఉద్వేగం ఉన్నప్పటికీ.. పురుషులకు వీర్యం విడుదల కాదు. ఇది ప్రభావిత వ్యక్తికి, వారి భాగస్వామికి బాధ, చిరాకును కలిగిస్తుంది. స్ఖలనం ఆలస్యం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
స్ఖలనం ఆలస్యం ప్రభావం
స్పెర్మ్ ను రిలీజ్ చేయకపోవడం సాధారణంగా హానికరం కానప్పటికీ.. ఇది లైంగిక సంతృప్తి, సన్నిహిత సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి స్పెర్మ్ ను రిలీజ్ చేయలేకపోతే వారికి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉండొచ్చంటున్నారు నిపుణులు. వీర్యకణాలు విడుదల కాకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు.
స్ఖలనం ఆలస్యం కావడానికి అంతర్లీన కారణాలు
మానసిక కారకాలు: ఆందోళన, నిరాశ, ఒత్తిడి, పనితీరులో ఆందోళన, రిలేషన్ షిప్ సమస్యలు స్ఖలనం ఆలస్యం కావడానికి కారణమవుతాయి.
వైద్య పరిస్థితులు: నిపుణుల ప్రకారం.. డయాబెటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, వెన్నెముక గాయాలు, హార్మోన్ల అసమతుల్యత, ప్రోస్టేట్ సమస్యలు వంటి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా స్ఖలనాన్ని ప్రభావితం చేస్తాయి.
మందులు: యాంటీ డిప్రెసెంట్స్, యాంటిసైకోటిక్స్ , రక్తపోటు మందులతో సహా కొన్ని రకాల మందులు స్ఖలనానికి ఆటంకం కలిగిస్తాయి.
మాదకద్రవ్యాల దుర్వినియోగం: మందును ఎక్కువగా తాగడం లేదా మాదకద్రవ్యాలను ఉపయోగించడం వల్ల లైంగిక పనితీరు ప్రభావితం అవుతుంది.
adam
స్ఖలన సమస్య లక్షణాలు
దీర్ఘకాలిక ఉద్దీపన ఉన్నప్పటికీ.. సంభోగం సమయంలో స్ఖలనం చేయడంలో ఇబ్బంది లేదా అసమర్థత.
స్ఖలనానికి చేరుకోవడానికి ఎక్కువ లేదా తీవ్రమైన ఉద్దీపన అవసరం.
స్ఖలనం చేయలేకపోవడం వల్ల నిరాశ, బాధ లేదా సంబంధాలపై ప్రతికూల ప్రభావం.
లైంగిక సంతృప్తి లేదా ఆనందం తగ్గుతుంది.
ఈ లైంగిక సమస్యకు చికిత్స ఏంటి?
సైకలాజికల్ థెరపీ: నిపుణుల ప్రకారం.. కౌన్సిలింగ్, కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, సెక్స్ థెరపీ వంటివి.. స్ఖలనం ఆలస్యం కావడానికి దారితీసే అంతర్లీన మానసిక కారకాలను పరిష్కరించడానికి సహాయపడతాయి.
మందుల సర్దుబాటు: మందులే స్ఖలనం ఆలస్యానికి కారణమైతే.. వీటిని డాక్టర్ సర్దుబాటు చేయొచ్చు. లేదా తక్కువ లైంగిక దుష్ప్రభావాలతో ప్రత్యామ్నాయ మందులను సూచించొచ్చు.
హార్మోన్ థెరపీ: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా స్ఖలనం ఆలస్యం అవుతుంది. ఇలాంటప్పుడు మీరు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని చేయించుకోవచ్చు.
జంటల చికిత్స: చికిత్స సెషన్లలో భాగస్వామిని నిమగ్నం చేయడం వల్ల వారి మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. అలాగే ఆందోళన లేదా పనితీరు ఒత్తిడిని తగ్గిపోతాయి.
వైబ్రేటరీ స్టిమ్యులేషన్: ఈ టెక్నిక్ పురుషాంగం అనుభూతులను పెంచడానికి, స్ఖలనాన్ని సులభతరం చేయడానికి ఫోకస్డ్ వైబ్రేషన్ అందించే పరికరాన్ని ఉపయోగిస్తుంది.