రోడ్డు మీద మన కళ్ల ముందు ఎవరైనా నగ్నంగా తిరుగుతూ కనిపించారు అనుకోండి.. ఏం చేస్తాం. వెంటనే అయ్యో.. మతిస్థిమితం లేదనకుంట.. అనుకొని వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. వాళ్లు వచ్చి.. వారికి దుస్తులు ఇచ్చి..ఎక్కడివారు.. ఏమిటి అని కనుక్కునే ప్రయత్నంచేస్తారు.
undefined
అయితే.. ఆ దేశాల్లో మాత్రం ఎవరైనా అలా నగ్నంగా తిరిగినా ఎవరూ పట్టించుకోరట. మహిళలు కూడా ప్రశాంతంగా నగ్నంగా జాగింగ్ లాంటివి చేస్తుంటారు. అయినా.. వారిని ఎవరూ విచిత్రంగా చూడరు. ఎందుకంటే.. అక్కడ నగ్నంగా తిరగడం వారి హక్కు. చట్టప్రకారం వాళ్లకు అలా తిరిగే స్వతంత్ర ఉంది. అలాంటి దేశాలు చాలానే ఉన్నాయి.
undefined
కొద్ది రోజుల క్రితం బ్రెజిల్ ప్లేబాయ్ మోడల్ లువానా శాండియన్ దుబాయ్ లోని ఎడారి మధ్యలో టాప్ లెస్ గా ఫోటోషూట్ చేసింది. నగ్నంగా ఫోటోషూట్ ఏంటి అని చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు
undefined
అభిమానులు ఆమె ఫోటోలు చూసి పండగ చేసుకున్నా.. ఎక్కువ శాతం విమర్శలే వచ్చాయి. వారి విమర్శలకు ఆమె తగినట్లు సమాధానం చెప్పినప్పటికీ.. అర్థనగ్నంగా ఫోటో దిగడమే నేరం అన్నట్లుగా కామెంట్స్ వినిపించాయి.
undefined
అయితే.. కొన్ని దేశాల్లో మాత్రం ఎవరు.. ఎక్కడ నగ్నంగా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. అక్కడి చట్టాలే వారికి ఆ హక్కును ఇచ్చాయి.
undefined
నగ్న జాగింగ్‌ను లీగలైజ్ చేసిన దేశాల్లో న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌లు ముందు వరుసలో ఉన్నాయి. బట్టలను ఇంటి దగ్గరే వదిలి నగ్నంగా రోడ్ మీదకొచ్చి జాగింగ్ లేదా వ్యాయామం చేయడాన్ని అక్కడి కోర్టులు అనుమతించాయి.
undefined
‘న్యూడ్ జాగింగ్ నేరమైతే దేవుడు మనకు జననాంగాలను ఇచ్చుండకూడదు’ అని ఓ న్యాయవాది కూడా పేర్కొనడం గమనార్హం. అక్కడ ఉదయం సమయాల్లో చాలామంది నగ్నంగానే జాగింగ్ చేస్తున్నారు. కాగా, నగ్నంగా సూర్యోదయ సమయాల్లో పరిగెట్టడం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని కొంతమంది నేచరిస్టులు వాదిస్తున్నారు.
undefined
స్పెయిన్ లో సైతం నగ్నంగా బీచుల్లో, వాకింగ్ పార్క ల్లో తిరిగే అవకాశం ఉంది. ఆ మేరకు అక్కడి ప్రభుత్వం దానికి చట్టరూపాన్ని ఇవ్వడం గమనార్హం.
undefined
ఇక ఫ్రాన్స్ లో సైతం నగ్నంగా తిరిగే అవకాశం ఉంది. అక్కడ దీని కోసం చట్టం ఏమీ రూపొందిచకపోయినా.. అలా తిరిగినా ఎవరూ అభ్యంతరం మాత్రం చెప్పరు.
undefined