జీవిత భాగస్వామి పై ప్రేమ ఉంటే ఈ పనులు అస్సలు చేయరు..!

First Published | Jul 23, 2022, 10:50 AM IST

మనం చేసే కొన్ని పనులు భాగస్వామిని ఇబ్బంది పెడతాయట. నిజంగా ఒకరు ఎవరినైనా ప్రేమిస్తే... కొన్ని పనులు చేసి ఇబ్బంది పెట్టరట.  అస్సలు చేయకూడని పనులు ఏంటో ఓసారి చూద్దాం..

Image: Getty Images

ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తున్నామంటూ కబుర్లు చెబుతూ ఉంటారు. అయితే... ప్రేమిస్తున్నాను అని చెప్పగానే సరిపోదు. నిజంగా మనం ఒకరిని ప్రేమిస్తే.. వారి కోసం కొన్నింటిని అలవాటు చేసుకోవాలి... మరికొన్నింటిని వదలుకోవాల్సి ఉంటుంది. 

Image: Getty Images

మోసం చేయడం, శారీరకంగా బాధించడం లాంటివి చేయనప్పటికీ.. మనం చేసే కొన్ని పనులు భాగస్వామిని ఇబ్బంది పెడతాయట. నిజంగా ఒకరు ఎవరినైనా ప్రేమిస్తే... కొన్ని పనులు చేసి ఇబ్బంది పెట్టరట.  అస్సలు చేయకూడని పనులు ఏంటో ఓసారి చూద్దాం..

Latest Videos


Image: Getty Images

చాలా మందికి  సెలబ్రెటీ క్రష్ లు ఉంటాయి. అయితే.. ఈ విషయం కూడా చాలా మందికి నచ్చదు. తమ భాగస్వామి మరొకరిని అభిమానం పరంగా ఇష్టపడినా చాలా మంది భరించరు. వారు పదే పదే ఆ విషయాన్ని తమ భాగస్వామికి చెప్పడం వల్ల వారిలో అభద్రతా భావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి... నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే వారు ఆ టాపిక్ మీ ముందుకు అస్సలు తీసుకురారు. 
 

Image: Getty Images

మీ భాగస్వామి ప్రతిరోజూ చిన్న చిన్న గొడవలను ఎంచుకుంటే, అతను/ఆమె మిమ్మల్ని అంతగా ప్రేమించకపోవచ్చు. సాధారణంగా, మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు, మనం క్షమించి, చిన్న విషయాలను వదిలివేయడానికి ప్రయత్నిస్తాము. కానీ.. ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగుగుతున్నారంటే.. వారితో మీ సంబంధం దెబ్బ తీస్తుంది. మనస్పర్థలు కూడా వస్తూ ఉంటాయి. 
 

మిమ్మల్ని ప్రేమించే, మిమ్మల్ని గౌరవించే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ పబ్లిక్‌గా నిలదీయడు. వివాదాన్ని ప్రైవేట్‌గా పరిష్కరించవచ్చు కానీ మీ భాగస్వామి అలా చేయకపోతే.. వారు మిమ్మల్ని పెద్దగా ప్రేమించడం లేదనే అర్థం చేసుకోవాలి.
 

sex

ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంపికలను ఎంచుకోవడానికి ఒకరిని ప్రోత్సహించడం మంచిది, సరైందే కానీ.. దానిని విమర్శిస్తూ చెప్పకూడదు. ఆ విషయం వారు మీకు చెబుతుంటే అందులో కూడా ప్రేమ కనిపించాలి కానీ.. విమర్శలు కనపడకూడదు. అలా కాకుండా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి అంటే.. ప్రేమ తక్కువగా ఉందనే అర్థం.

అందరి ముందు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం ఎప్పుడూ  చేయకూడదు. మీ భాగస్వామి మిమ్మల్ని ప్రతిసారీ అందరి ముందు నిరుత్సాహ పరుస్తున్నారు అంటే.. ఆ విషయం గురించి మరోసారి ఆలోచించాల్సిందే. అందరి ముందు విమర్శించడం ఏ మాత్రం మంచి విషయం కాదు. ప్రేమ ఉన్నవారు ఎవరూ అలా అందరి ముందు మిమ్మల్ని ఎప్పటికీ తక్కువ చేయరు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. 
 

click me!