సంబంధంలో ప్రేమ , ప్రశంసలు.. చాలా ముఖ్యం. బహుమతులు ఇవ్వడం, ఔట్ టేకింగ్ చేయడం అంత ముఖ్యమైనవి కావు అని చాలామంది చెబుతారు. కానీ రిలేషన్ షిప్ లో గిప్ట్స్ ఇవ్వడం ముఖ్యం. ఇది భావాలను వ్యక్తీకరించే మార్గం కూడా. మీరు భావోద్వేగాలను వ్యక్తపరచలేనప్పుడు, మీరు మీ భాగస్వామికి అర్థవంతమైన బహుమతిని ఇవ్వవచ్చు. ఇది మీ భాగస్వామి మీ గురించి ప్రత్యేకంగా భావించడమే కాకుండా, మీరు మాటల్లో చెప్పలేని వాటిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది.