శృంగారం..ఈ వారాల్లోనే మాంచి మూడ్..

First Published | Oct 10, 2019, 3:39 PM IST

శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నట్టు తేలింది. 
 

శృంగారమంటే ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. దాని మీద ఎంత ఆసక్తి ఉన్నా... కొందరు మాత్రం పడక గదిలో ఫెయిల్ అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.
ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ యుగంలో.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడపడమే గగనమైపోయింది. దొరికిన కాస్తో, కూస్తో సమయంలోనే పార్టనర్ ని మెప్పించాలి. అలా మెప్పించాలంటే... ముందు మనకు మూడ్ ఉండాలి. మూడ్ రావాలన్నా కూడా.. దానికంటూ ప్రత్యేకమైన వారాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

నమ్మాలని అనిపించడం లేదా..? కానీ ఇది నిజం. వారాన్ని బట్టి మనకు మూడ్ వస్తుందట. ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్ట పడుతున్నట్టు తేలింది.
ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట. శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట
అయితే కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే పుడుతున్నాయని సర్వేలో తేలింది.
పని ఒత్తిడి కారణంగా, తెల్లవారుజామున సెక్స్‌ చేయ డానికి కేవలం పదిశాతం మంది మాత్రమే సిద్ధ పడుతున్నారట. అన్నింటికన్నా మంగళవారం రోజున అతితక్కువ మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. దాని తర్వాత స్థానంలో గురువారం ఉంది.
మిగిలిన వారాలైన సోమవారం రోజు 8 శాతం మంది బుధవారం నాడు 7 శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపు తున్నారట. పైగా శృంగార కోరికలనేవి వేసవి కాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది.
వారానికి నాలుగుసార్లు శృంగారం జరిపే దంపతులు తమ సహజమైన వయస్సుకన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది.

Latest Videos

click me!