కామక్రీడలో భావప్రాప్తి.. ప్రాణాలు తీసింది...!

First Published | Jan 29, 2021, 9:57 AM IST

శృంగారం చేస్తూనే స్పృహ కోల్పోయాడు. అలా బెడ్ మీద ఒరిగిపోయాడు. కాసేప‌టికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని వేశ్య త‌న ఫ్రెండ్స్‌కి చెప్పింది.

శృంగారం ఎంతో అందమైన అనుభూతి. ఈ శృంగారం కారణంగా మనిషికి ఆనందంతోపాటు.. ఆరోగ్యం కూడా లభిస్తుంది. దీని వల్ల అనేక లాభాలు ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే... ఇదే శృంగారం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. నమ్మసక్యంగా లేకపోయినా.. ఇదే నిజం. ఓ వ్యక్తి శృంగారంలో తీవ్ర ఉద్వేగానికి గురై.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
undefined
పూర్తి వివరాల్లోకి వెళితే... ఆఫ్రికాలోని మాల‌వి దేశానికి చెందిన 35 ఏళ్ల చార్లెస్ మ‌జ‌వా ఓ సెక్స్ వ‌ర్క‌ర్‌తో శృంగారంలో పాల్గొన్నాడు. ఇద్ద‌రూ మంచి అనుభూతిని పొందుతుండ‌గా.. చార్లెస్ మితిమీరిన కామోద్రేకానికి గుర‌య్యాడు.
undefined

Latest Videos


శృంగారం చేస్తూనే స్పృహ కోల్పోయాడు. అలా బెడ్ మీద ఒరిగిపోయాడు. కాసేప‌టికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విష‌యాన్ని వేశ్య త‌న ఫ్రెండ్స్‌కి చెప్పింది. ఆ త‌ర్వాత పోలీసుల‌కు స‌మాచారం అందించగా, వారు వ‌చ్చి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
undefined
చార్లెస్ శృంగార చ‌ర్య‌లో బాగా లీన‌మై మితిమీరిన కామోద్రేకానికి గుర‌య్యాడు. దాంతో అత‌ని నాడీ వ్య‌వస్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపి, మెద‌డులోని ర‌క్త నాళాలు చిట్లిపోవ‌డంతో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంది
undefined
చార్లెస్ మృతితో వేశ్య‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, ఆమెపై కేసు న‌మోదు చేయ‌లేద‌ని పోలీసులు తెలిపారు.
undefined
ఆరోగ్య‌క‌ర‌మైన శృంగారం గుండెకు మంచిద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. గుండెపోటుకు గురైన వారు.. ఆ త‌ర్వాత ఆరోగ్య‌క‌ర‌మైన శృంగారాన్ని చేస్తే మ‌రికొంత‌కాలం మ‌నుగ‌డ సాగించే అవ‌కాశం ఉంటుంద‌ని వెల్ల‌డైంది.
undefined
ఈ విష‌యాన్ని ప్రివేంటివ్ కార్డియాల‌జీకి సంబంధించిన‌ యూరోపియ‌న్ జ‌ర్న‌ల్ వెల్ల‌డించింది. శృంగారం ప‌ట్ల భ‌యం ఉంటే అది శరీర అవ‌య‌వాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొంది.
undefined
click me!