మహిళల్లో పీరియడ్స్( రుతుక్రమం) రావడం అనేది సర్వసాధారణం. అది నెలనెలా వస్తూనే ఉంటుంది. అయితే.. ఈ పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ విషయానికి వచ్చే సరికి.. మరిన్ని అపోహలు పెరిగిపోతాయి.
అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల ఎవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం కూడా చాలా మందిలో ఉంది. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. భార్యభర్తలకు ఇష్టమైతే.. పీరియడ్స్ సమయంలో కూడా సెక్స్ చేయవచ్చని సూచిస్తున్నారు.
అయితే.. చాలా మందికి మరో అనుమానం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే వెంటనే గర్భం వస్తుందా రాదా అని. దీని కోసంచాలా మంది గూగుల్ లో శోధిస్తూ కూడా ఉంటారు. దీని గురించి నిపుణులు తాజాగా ఓ వివరణ ఇచ్చారు.
వారు చెప్పినదాని ప్రకారం.. పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు తక్కువ. అలా అని అసలు రాదు అని కూడా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే కొందరికి ఎక్కువ, తక్కువ వస్తుంటాయి. కొందరికి రుతక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. అవి నిజమైన పీరియడ్స్ అవునో కాదో.. లోపల అండం విడుదలైందో లేదో గుర్తించడం కష్టం.
కాబట్టి కచ్చితంగా గర్భం రాదు అని మాత్రం చెప్పలేం. కొంతమందికి నెలసరి సక్రమంగా వస్తూ ఉంటుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా తేదీ కూడా మారదు వాళ్ల విషయంలో. వారికి మాత్రం పీరియడ్స్ లో శృంగారం చేసినా గర్భం రాదు.
అయితే.. పీరియడ్స్ సమయంలో కలయిక ఇద్దరికీ ఇష్టపూర్వకమైతేనే పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. కొందరికి చాలా చిరాకుగా అనిపించే అవకాశం ఉందంటున్నారు.
పీరియడ్స్ లో రక్త స్రావం బయటకు వస్తూ ఉంటుంది. దానికి తోడు యోని మృదుత్వం కోసం సాధారణంగా సంభోగం సమయంలో వెలువడే స్రావాలు పీరియడ్స్ సమయంలో బయటకు వచ్చే అవకాశం ఉండదు. దాని కారణంగా అంగ ప్రవేశం చేసే సమయంలో నొప్పి ఉండే అవకాశం ఉంది. అయితే... పీరియడ్స్ నొప్పిని కలయిక ద్వారా తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.