ప్రతి ఒక్కరూ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలని ఉవ్విల్లూరుతుంటారు. అయితే.. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ.. మొదట్లో ఉన్న కేరింగ్, ప్రేమ తగ్గిపోతూ ఉంటాయి. ఒకరినొకరు పట్టించుకోవడం మానేస్తుంటారు.
దీంతో.. గుర్తించిలోపే.. దంపతుల మధ్య దూరం పెరిగిపోతోంది. అది కాస్త కొందరి విషయంలో మనస్పర్థలు దారితీయగా.. కొందరి విషయంలో ఏకంగా విడాకులు తీసుకునేదాకా వస్తుంది. అయితే.. అలా జరగకుండా సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుంటే కష్టాలు కూడా ఇష్టాలుగా మారిపోతంటాయి. అందుకే ఒకరికి ఒకరు ఎప్పుడూ అండగా ఉండేలా చూసుకోండి. కష్టాలు, సుఖాలను సమంగా పంచుకోండి.
దాపరికాలు లేకుండా ఓపెన్ గా ఉండాలి. ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండాలి.
కుటుంబం, సంపాదన మధ్య వ్యక్తులకు సొంతంగా ప్రైవేట్ టైమ్ లభించడం లేదు. అందుకే మీరు మీకుగా ఒక మీ టైమ్ ( Me Time ) ను ఫిక్స్ చేసుకోండి. అప్పుడు ఒంటరిగా ఉంటూ మీకు నచ్చిన పని చేయండి. మీ భాగస్వామికి కూడా మీ టైమ్ కేటాయించండి.
తప్పు, ఒప్పులు జీవితంలో సాధారణం.అయితే తప్పులు జరిగినప్పుడు మీరు మీ భాగస్వామిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్. ఏదైనా తప్పు జరిగింది అని మీ జీవిత భాగస్వామి చెబితే వారు చెప్పేది పూర్తిగా విని సరి చేసుకునే అవకాశం ఇవ్వండి.
ఎంత బిజీగా ఉన్నా ఒకరితో ఒకరు సమయం వెచ్చించేందుకు ప్రయత్నించండి. దాని కోసం ఒక టైమ్ నిర్ణయించుకుని ముందే సిద్ధం అవ్వండి.
గొడవలే లేని సంసారం.. పడవలు లేని సాగరం ఉండదు కదా... అందుకే గొడవలు వస్తే అందులో పాయింట్ పై గొడవపడవచ్చు. దాని వల్ల ఒక నిర్ణయం బయటికి రావాలి. అంతే కాని గోడలు కూలిపోయేలా, టాప్ లేచిపోయేలా ఉండకూడదు.