ఈరోజుల్లో పెళ్లి అనగానే ముందుగా వినపడేది ప్రీ వెడ్డింగ్ షూట్. జీవితంలో పెళ్లి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకే, దానిని అందంగా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది ఆశపడుతున్నారు. పెళ్లిలో ఫోటోలు తీయించుకోవడం అనే కాన్సెప్ట్ 80ల కాలం నుంచే ఉంది. తర్వాత వీడియోలు, ఆల్బమ్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ నడుస్తోంది. అయితే, కొందరికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలనే కోరిక ఉన్నా, బడ్జెట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. లొకేషన్లకే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి అని ఫీలౌతూ ఉంటారు. కానీ, లొకేషన్ ఖర్చు లేకుండా, హ్యాపీగా తక్కువ ఖర్చుతో కూడా అందంగా ఫోటోలు దిగొచ్చు. ఆ లొకేషన్స్ ఏంటో ఓసారి చూద్దాం...
ముంబయి నగరంలో ఎన్నో అందమైన లొకేషన్లు ఉన్నాయి. మనం ముంబయి వరకు వెళితే చాలు, లొకేషన్ కోసం ఎలాంటి ఖర్చు పెట్టకుండా, అందమైన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకకోవచ్చు.