లిప్ కిస్ తో బోలెడు లాభాలు.. ఏంటేంటో తెలుసా?

First Published | Oct 7, 2023, 4:30 PM IST

కిస్సును ఇష్టపడని జంట ఉండదు. అందులో చాలా మంది లిప్ టూ లిప్ కిస్ ను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ కిస్ ఇద్దరికీ మంచి మూడ్ ను తీసుకురావడమే కాకుండా మీకు బోలెడు ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది తెలుసా? 
 

ముద్దు ముచ్చటను ఇష్టపడనివారు ఉండరు. ముద్దు ఒక రొమాంటిక్ మూడ్. ఇది ఇద్దరినీ సెక్సీ మూడ్ లోకి తీసుకెళుతుంది. నుదుటిపై, బుగ్గలపై ముద్దు పెట్టుకుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అదే పెదాలతో ముద్దు పెట్టుకుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. పెదాల చర్మం చాలా పల్చగా ఉంటుంది. ఈ చర్మం కింద ఎన్నో నరాలు ఉంటాయి. పెదవుల్లోని నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇది మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. నిజానికి మెదడును శరీరంలోని మిగిలిన భాగాలతో కలిపే నరాల సంఖ్య కంటే పెదవులను మెదడుకు అనుసంధానించే నరాల సంఖ్య ఎక్కువగా ఉంటుందట.
 

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముద్దు అనే కాన్సెప్ట్ ముందుగా చింపాంజీలతో మొదలైంది. ఒక పరిణామ సిద్ధాంతం ప్రకారం.. చింపాంజీలు నోటి నుండి నోటికి ఆహారం తీసుకునేటప్పుడు లిప్ కిస్ మొదలైంది అంటుంటారు. అంతేకాక తల్లి చింపాంజీ పిల్ల చింపాంజీని తన పెదవులతో పెదవులను ప్రేమగా తాకింది అనే ఒక సిద్ధాంతం ఉంది. ఈ భావన మనుషుల్లో ఎప్పుడు మొదలైందో కానీ దీనిని నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. 


kiss

ముద్దు ప్రేమకు చిహ్నం అన్న ముచ్చట అందరికీ తెలుసు. ఇది భార్యాభర్తల్లో శృంగారానికి చిహ్నం కూడా. కానీ లిప్ కిస్ పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి ఎంతో కష్టపడిపోతుంటారు. అయితే ముద్దు కూడా బరువును తగ్గించడానికి, బరువును మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి. ఇది నిజమని రుజువైంది కూడా. బరువును తగ్గించడానికి జంటలు లిప్ కిస్ ను ట్రై చేయొచ్చు. 
 

ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

అవును ముద్దు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ముద్దుతో ఒత్తిడి, డిప్రెషన్, బలహీనత, యాంగ్జైటీ వంటివి తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముద్దు మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. దీంతో మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

ముఖం అందంగా 

ముద్దు కూడా ఒక రకమైన ముఖ్య వ్యాయామమే. అవును ముద్దును పెట్టుకుంటే ముఖ కండరాలు కదులుతాయి. ఫలితంగా మీ ముఖంపై పేరుకుపోయిన కొవ్వు పరిమాణం తగ్గుతుంది. దీంతో మీ ముఖ కండరాలు బాగుంటాయి. ముఖ సౌందర్యం కూడాపెరుగుతుంది.
 

హ్యాపీ హార్మోన్లు

ముద్దు పెట్టుకున్నప్పుడు మీ శరీరంలో కొన్ని హార్మోన్లు బాగా పెరుగుతాయి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతాయి. ఈ హార్మోన్లనే హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఇవి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. అంతేకాదు మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ జీర్ణక్రియ మెరుగపడుతుంది. ఈ హార్మోన్లు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. 
 

ఇమ్యూనిటీ పవర్

ముద్దు కూడా మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. లిప్ టూ లిప్ కిస్ పెట్టుకోవడం వల్ల నోట్లోని లాలాజలం పరిమాణం పెరుగుతుంది. అలాగే లాలాజలం మార్పిడీ అవుతుంది. దీంతో మీ నోట్లో పేరుకుపోయిన క్రిములు చనిపోతాయి. అలాగే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ముద్దు దంత క్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తుంది. మైగ్రేన్ నొప్పి కూడా తగ్గిపోతుంది.
 

తలనొప్పి నుంచి ఉపశమనం

మీకు తెలుసా? రెగ్యులర్ గా ముద్దు పెట్టుకునే వారికి తలనొప్పి వచ్చే అవకాశం చాలా తక్కువని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ ముద్దు మిమ్మల్ని సెక్స్ వరకు కూడా తీసుకెళుతుంది. సెక్స్ మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. మీ బంధం కూడా బలంగా ఉంటుంది. 
 

Latest Videos

click me!