Relationship: హద్దులు దాటిన ప్రేమ ఒక వ్యసనం.. అది అనర్ధానికి దారి తీయవచ్చు!

First Published | Oct 7, 2023, 3:08 PM IST

 Relationship: ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరు ప్రేమని చూసినప్పుడు ఆ ప్రేమ అంతు లేకుండా అసహజంగా ఉంటుంది. అసలు హద్దులు లేని ప్రేమ ఎలా ఉంటుంది. ఓసారి చూద్దాం.
 

 ఒకరిపై ప్రేమ హద్దులు దాటి వారు లేకుంటే బ్రతకలేం అనే స్థితికి చేరి, అదొక వ్యసనంగా మారిపోయి, తమపై తామే ఆధీనం కోల్పోయి ప్రేమ పరాకాష్టకు చేరి, అవతలి వారు నుంచి కూడా అదే స్థాయిలో ప్రేమని ఆశిస్తూ  వారికి ప్రేమను ఒక శాపంగా మార్చే ప్రవర్తనని హద్దులు దాటిన ప్రేమ అంటాం. దీనినే లవ్ ఎడిక్షన్ లేదా పేథోలాజికల్ లవ్ అంటారు.
 

 నిజానికి అంత ప్రేమ అసాధ్యమే కాదు అసహజం, అనర్థం కూడా. మోతాదుకి మించిన ప్రేమ, ప్రేమించిన వ్యక్తితో పాటు ప్రేమను పొందే వారికి కూడా మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఈ లవ్ అడిక్షన్ తాలూకా లక్షణాలు ఏమిటంటే సహచరులు పక్కన లేకపోతే సర్వం కోల్పోయినట్లు హృదయాన్ని పెకిలించినట్లు ఫీలవుతారు.
 


ప్రతి విషయానికి సహచరులపై ఆధారపడతారు. భార్యని లేదా భర్తని ఎవరితోనూ మాట్లాడినివ్వకపోవడం, నిరంతరం వారిపై నిఘా పెట్టడం  చేస్తారు. లవ్ ఎడిక్షన్ ఉన్న వారిలో సహచరులపై ప్రేమ కన్నా ఆధిపత్యమే  ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
 

వారి కోరికలు శారీరకమైన, మానసికమైనా అన్నీ నెరవేరాలనుకుంటారు. లేకుంటే వీరి ప్రవర్తన దారుణంగా మారిపోతుంది. ఏకాగ్రత లోపించి కొన్నిసార్లు పిచ్చివాళ్ళైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్ర అలాంటిదే.
 

ఇది వాళ్ళు ప్రేమ అనుకుంటారు కానీ నిజానికి ఇది ఒక మానసిక రోగం. దీనిని గుర్తించడం అంత సులువు కాదు. గతంలో తాము ప్రేమించిన వారి నుంచి నిరాదరణ ఎదుర్కొన్న వారు, ప్రియుడు లేదా ప్రియురాలి మోసానికి బలి అయిన వారు లేదంటే..
 

 గతంలో లైంగిక వేధింపుల వంటివి ఎదుర్కొన్నవారు ఇలాంటి లవ్ ఎడిక్షన్ కి గురి అవుతారు. కాబట్టి ఇలాంటి వాళ్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు కేవలం మానసిక రోగులు మాత్రమే. ప్రేమతో ప్రయత్నిస్తే వాళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తారు.

Latest Videos

click me!