వీర్యకణాలను పెంచే ఫుడ్స్ ఇవి..!

First Published | Oct 7, 2023, 3:43 PM IST

నపుంసకత్వం లేదా కణాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. అవును పురుషుల శరీరంలో పోషకాలు తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

sperm count

వీర్యకణాలు తక్కువగా ఉంటే పిల్లలు పుట్టడం కష్టం. ఇది వైవాహిక జీవితంలో ఎన్నో గొడవలకు కారణమవుతుంది. అంతేకాదు లైంగిక జీవితం కూడా దెబ్బతింటుంది. అయితే ఒక అధ్యయనం ప్రకారం.. రకరకాల పండ్లు, కూరగాయలు, చేపలతో సహా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే రెడ్ మీట్, వేయించిన ఆహారాలు, చక్కెర పానీయాలు, స్వీట్లను తగ్గించాలి. ఇవి మీ స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయి. హెల్తీ ఫుడ్స్ ను తినడం వల్ల సంతానోత్పత్తి  పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా సహజంగా మెరుగుపడుతుంది. పోషకాల లోపం వల్ల నపుంసకత్వం లేదా వీర్యకణాల సంఖ్య తగ్గడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇవి పెంచుకోవడానికి ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుడ్లు

గుడ్డు సంపూర్ణ ఆహారం. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఇది స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. అలాగే స్పెర్మ్ కదలికను మెరుగుపరుస్తుంది. 

Latest Videos


అరటి పండు

అరటి పండు తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ పండులో మెగ్నీషియం, విటమిన్ బి1, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే వీర్యకణాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అరటిపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది స్పెర్మ్ కదలికకు సహాయపడుతుంది.
 

బచ్చలికూర

బచ్చలికూర కూడా స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్ స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ సంతానోత్పత్తి పెరుగుతుంది. 

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో సెలీనియం అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ చలనశీలతను పెంచడానికి సహాయపడుతుంది.
 

దానిమ్మ

దానిమ్మ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రవాహంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించి వీర్యకణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

టమాటాలు

టామాటాల్లో లైకోపీన్, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

dark chocolate

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లు కూడా లైంగిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎల్-అర్జినిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ లెవల్స్ ను మెరుగుపరుస్తుంది. మీ చక్కెర డెజర్ట్ ను డార్క్ చాక్లెట్ ముక్కతో భర్తీ చేయడానికి ప్రయత్నించండి.
 

pumpkin seeds

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలు పునరుత్పత్తి ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి. విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్  కౌంట్ ను బాగా పెంచుతాయి.
 

క్యారెట్

క్యారెట్లు కంటి ఆరోగ్యానికే కాదు.. పునరుత్పత్తి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.  ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల స్పెర్మ్ దెబ్బతినకుండా నిరోధించడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్ ఇది.

వాల్ నట్స్

వాల్ నట్స్ ను తింటే ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఇవి కూడా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కదలికను మెరుగుపరుస్తాయి.

click me!