ఏ బంధంలో అయినా గొడవలు వాదనలు లేకుండా ఆ బంధం కొనసాగదు. అందులోనూ భార్యాభర్తల బంధం అంటే గొడవలు, వాదనలు సర్వసాధారణం. అయితే శృతి మించి వాదించుకోవడం, గొడవలు పడటం బంధాన్ని బీటలువారే లాగా చేస్తుంది.
కానీ ఆరోగ్యకరమైన వాదన భాగస్వాముల మధ్య సానిహిత్యాన్ని పెంచుతుంది. నిజమేనండి బంధం బలపడాలంటే అప్పుడప్పుడు వాదన అవసరం అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. ఆరోగ్యకరమైన వాదన వలన భాగస్వామి ఏ ఏ విషయాలలో మెచ్చుకుంటారు.
లేదా ప్రశంసిస్తారు లేదా చిరాకు పడతారు అనే విషయాలు తెలుస్తాయి. గొడవ జరిగిన తరువాత ఒకరికి ఒకరు చెప్పుకునే క్షమాపణల వలన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది వారిద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. అలాగే వాదన సమయంలో మీ అభిప్రాయాన్ని మీకు తెలియకుండానే వ్యక్త పరుస్తారు.
దీని వలన మీరు మెంటల్లీ చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు. అయితే అప్పుడు మీ నోటి నుంచి వచ్చే మాటలు అసభ్యకరంగా ఉండకుండా చూసుకోండి. ప్రతి బంధము రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ప్రతి సంబంధం లోని హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి కూర్చొని పరిష్కరించుకోవడం వలన మీలో ఉండే తప్పులు మీరు తెలుసుకోగలుగుతారు.
అలాగే ఎదుటివారి తప్పులను వారికి తెలియజేసే అవకాశం కలుగుతుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళికలపై ఆరోగ్యకరమైన వాదన చాలా అవసరం. వచ్చే పది సంవత్సరాలలో మీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నారో, పిల్లలు భవిష్యత్తు, ఆర్థిక స్థిరత్వం వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు జరిగే వాదన ఆయా విషయాలపై మీకు ఒక ఖచ్చితత్వాన్ని తీసుకువస్తుంది.
అంతేకాదు ఆయా విషయాలపై మీకు మరింత అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివలన భవిష్యత్తులో రాబోయే అపార్థాలను కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన వాదన జరిగినప్పుడు ఆందోళన పడకండి అది బంధాన్ని బలపరుస్తుందని తెలుసుకోండి. కానీ ఎక్కడా శృతి మించి వాదన చేయకుండా జాగ్రత్త పడండి.