భార్యాభర్తలు కలయికకు దూరంగా ఉండటానికి కారణాలు ఇవే..

First Published Dec 20, 2023, 3:07 PM IST

చాలా మంది జంటలు కొన్నేండ్ల తర్వాత కలయికకు దూరంగా ఉంటారు. కానీ ఇది వారికి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. మరి ఇలా దూరంగా ఉండటానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వయసు పెరిగే కొద్దీ బంధాలు బలపడతాయి. కానీ దంపతుల లైంగిక జీవితం విషయానికొస్తే  ఇది రోజు రోజుకు బలహీనపడుతుంది. సమయం, వయస్సుతో పాటుగా  కొంతమంది భాగస్వాములు లైంగిక కార్యకలాపాలు, సాన్నిహిత్యం క్షీణిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ దూరం వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. అసలు జంటలు కలయికకు ఎందుకు దూరంగా ఉంటారో తెలుసా? 
 

కలయికకు దూరంగా ఉండటం సాధారణమేనా?

మీ జీవితంలో మీరు చాలా సమయాల్లో లైంగికంగా చురుగ్గా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మీరు లైంగిక కార్యకలాపాల వైపు అంతగా మొగ్గు చూపకపోవచ్చు. లైంగిక కార్యకలాపాలను ఆపేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. సెక్స్ లో పాల్గొనడం మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని సూచిస్తుంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో చాలా మంది వయసు, లేదా పెళ్లి చేసుకోవకపోవడం వంటి కారణాల వల్ల కలయికలో పాల్గొనకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. తక్కువగా సంపాదించడం వల్ల కూడా సెక్స్ లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదట. లైంగిక కార్యకలాపాల పట్ల ఆసక్తి తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

sex life

సంబంధాల సంఘర్షణ

మీ భాగస్వామి గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారనే దానితో  లైంగిక కార్యకలాపాలకు సంబంధం ఉంటుంది. అంటే భార్యభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు ఎక్కువగా జరిగితే కూడా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఉండదు. ఈ కొట్లాటలు లైంగిక జీవితానికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే దంపతుల మధ్య ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ ఉండాలి. 
 

sex life

నమ్మకం లేకపోవడం

సేజ్ జర్నల్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. రిలేషన్ షిప్ లో నమ్మకం ప్రాముఖ్యత గురించి వివిరించింది. ఒక సంబంధం ఎంత రొమాంటిక్ గా ఉంటుందనేది నమ్మకమే చెప్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని పీడియాట్రిక్స్ విభాగం నిర్వహించిన మరొక అధ్యయనం ప్రకారం.. నమ్మకం సెక్స్ కు .. పూర్వ, పర్యవసానంగా కనిపిస్తుంది. అలాగే లైంగిక విశ్వాసం ఉల్లంఘనలు ఎన్నో సంబంధాల సౌకర్యాన్ని, భద్రతను దెబ్బతీస్తాయి.
 

నమ్మకద్రోహం

ది జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. యూఎస్ లో విడాకులకు నమ్మకద్రోహమే అతిపెద్ద కారణమని నివేదించబడింది. ఏదేమైనా.. ఇది లైంగిక, సంబంధాల సంతృప్తిని నమ్మకద్రోహానికి ప్రాధమిక కారణాలలో ఒకటిగా చేస్తుంది

యోనిస్మస్

యోనిస్మస్ అనేది యోని కండరాలు అసంకల్పితంగా సంకోచించే లైంగిక పరిస్థితి.  ఇది లైంగిక కార్యకలాపాల సమయంలో నొప్పిని కలిగిస్తుంది. యోని కండరాల నిరంతర సంకోచాల కారణంగా ప్రవేశం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది కూడా కలయికకు ఉండటానికి ఇది బలమైన కారణం కావొచ్చు.

లైంగిక గాయం

యుఎస్‌లోని రెయిన్ అనే లైంగిక హింస వ్యతిరేక సంస్థ.. దేశంలో ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 463,634 మంది వ్యక్తులు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. ది జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. లైంగిక గాయం బాధితులు కూడా సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారు. 

click me!