అందరూ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా.. అబ్బాయిలు అబద్దాలు చెబుతారు అనేది మాత్రం నిజం. చాలా అరుదుగా పురుషులు నిజాయితీ గా మాట్లాడతారు. ముఖ్యంగా అమ్మాయిల ముందు.. అది కూడా.. తొలిసారి డేట్ కి వెళ్లినప్పుడు మాత్రం... ఎక్కువగా అబద్దాలే చెబుతారు. ఎందుకంటే... వారు తొలి ప్రయత్నంలోనే.. స్త్రీలను ఆకట్టుకోవాలని అనుకుంటారు. అందుకే.. ఎక్కువగా అబద్దాలు చెబుతూ ఉంటారు. కామన్ గా.. ఫస్ట్ డేట్ లో అబ్బాయిలు చెప్పే అబద్దాలేంటో ఓసారి చూద్దామా..
దాదాపు చాలా మంది అబ్బాయిలు తమ ఉద్యోగం గురించి అబద్దం చెబుతారట. నమ్మసక్యంగా లేకపోయినా ఇదేనిజం. వారు చేసేదానికంటే కాస్త ఎక్కువ చేసి చెప్పుకుంటారట. ఇది కాదు అంటే... తమది పెద్ద కంపెనీగా లేదా.. తాము లేకుంటే కంపెనీ నే లేదు అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. చాలా మంది కామన్ గా చెప్పే అబద్దం ఇది.
ఇక.. తమ ఇంటి విషయంలోనూ వారు అబద్దం చెబుతూ ఉంటారట. ఇల్లు విశాలంగా ఉందని కొందరు.. తాము పేరెంట్స్ తో కలిసి ఉంటున్నామని అంటే.. బుద్దిగా ఉంటున్నామని.... నమ్మించాలని చూస్తుంటారట. కానీ వారిలో చాలా మంది తమ పేరెంట్స్ తో నిజంగా కలిసి ఉండకపోవడం గమనార్హం.
ఇక.. ఫస్ట్ డేట్ లో అమ్మాయిని కలుసుకున్నప్పుడు.. అబ్బయిలు తమకున్న ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి అస్సలు మాట్లాడరు. ఇక.. తాము చాలా స్వతంత్రంగా ఉన్నామని నిరూపించుకోవాలని అనుకుంటారు. తాము.. ఇంటిని , ముఖ్యంగా తమ గదిని చాలా నీట్ గా ఉంచుకుంటామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇది వారు కామన్ గా చెప్పే అబద్దం.
ఇక.. ప్రతిరోజూ మద్యం తాగే అలవాటు ఉన్నవారు కూడా ఈ విషయాన్ని వారు ముందు అంగీకరించరట. వారి గురించి మీకు పూర్తిగా తెలిస్తే తప్ప.. వారు రోజూ తాగుతారు అనే విషయం తెలియదు. అప్పటి వరకు తాము అకేషనల్ డ్రింకర్స్ అని చెబుతూ ఉంటారట.
ఇక... తమకు తాము ఫిట్నెస్ ప్రీక్స్ అని నిరూపించుకోవడానికి తాప్రతయపడతారు. తాము తరచూ.. జిమ్ కి వెళతామని చెబుతుంటారు. దానిలో నిజముండచ్చు. కానీ... దానిని మరి కాస్త ఎక్కువ చేసి చెబుతుంటారట.