తక్కువ కొవ్వు గలపెరుగు, గుడ్ల వంటి వాటిల్లో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే. పండ్లు, పొట్టతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.