స్త్రీలలో లైంగిక శక్తిని పెంచే మందులు ఏంటో తెలుసా?

First Published | Dec 15, 2021, 1:20 PM IST

వయాగ్రా (Viagra) పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు పనిచేస్తుంది. వారిలో లైంగిక శక్తిని (Sexual energy) పెంచి కోరికలను పెంచుతుంది. అయితే ఇది ప్రత్యేకంగా పురుషుల కోసం ఉద్దేశించినది. మరి మహిళలలో శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఎలాంటి మందులు వాడాలి? వారిలో కోరికలు తగ్గడానికి గల కారణాలు ఏమిటి? ఇలా మొదలైన విషయాల గురించి శృంగార నిపుణుల సలహాలతో ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరిగింది.

భార్యాభర్తల మధ్య శృంగారం వయసుతో సంబంధం లేకుండా ఆనందంగా సాఫీగా జరిగిపోవాలనేది అనేక మంది కోరిక. అయితే మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు వయాగ్రా ఉపయోగపడుతుంది. మరి ఆడవారి విషయంలో ఎలాంటి మందులను వాడితే మంచిదో డాక్టర్లు సూచనలతో తెలియజేయడం జరిగింది. వీటిని ఉపయోగిస్తే మోనోపాజ్ (Monopause) దశలో కూడా మహిళలు సంపూర్ణమైన దాంపత్య జీవితాన్ని (Married life) ఆస్వాదించవచ్చు.
 

సాధారణంగా మోనోపాజ్ దశలో మహిళలకు ఎదురయ్యే హార్మోన్ల సమస్యల (Hormonal problem) కారణంగా కోరికలు తగ్గే అవకాశం ఉంటుంది. వీరిలో కోరికలు తగ్గడానికి  కొన్ని కారణాలు ఉన్నాయి. మోనోపాజ్ దశలో ఉన్న మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ (Estrogen hormone) ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ హార్మోను తగ్గడంతో వారిలో లైంగిక కోరికలు తగ్గుతాయి. జననాంగాల్లో లూబ్రికేషన్, తేమ  వంటివి తగ్గుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వారు శృంగారంలో పాల్గొనడానికి అసౌకర్యంగా ఉంటుంది.
 


ఈ సమస్యల కారణంగా వారు లైంగిక చర్యలో పాల్గొనేందుకు ఆసక్తి చూపరు. వారిలోని శరీర మార్పుల కారణంగా మానసికంగా ఒత్తిడి (Mentally stressed) కూడా పెరుగుతుంది. ఇది వారి లైంగిక జీవితంపై ప్రభావితం చూపుతుంది.  ఆడవారిలో అసౌకర్య సమస్యలను తగ్గించుకోవడానికి ఈస్ట్రోజన్ ఉన్న జెల్, ల్యూబ్రికెంట్స్ (Lubricants), క్రీమ్ లను వాడడం మంచిది. అలాగే లైంగిక కోరికలను పెంచడానికి టెస్టోస్టిరాన్ సప్లిమెంట్ల వాడకం మంచిది. అయితే ఈ మందులను మొదట వేసుకున్నప్పుడు కాస్త తలనొప్పి, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 

కొద్ది సమయానికి తగ్గిపోతాయి. ఈ మందుల వాడకం గురించి డాక్టర్లను సంప్రదించి ఉపయోగించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే లైంగిక సామర్థ్యాన్ని పెంచే మరికొన్ని మందులు కూడా ఉన్నాయి. పురుషులకు వయాగ్రా ఎలా పని చేస్తుందో మహిళలకు కూడా ఫిమేల్ వయాగ్రాగా (Female Viagra) పిలువబడే కొన్ని మందులు ఉన్నాయి. ఇవి మెదడు నుంచి సెరటోనిన్, డోపమిన్ (Dopamine) వంటి  హార్మోనులను విడుదల చేసి మహిళల్లో లైంగిక ఆసక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే మొదట డాక్టర్ల సలహా మేరకు ఈ మందులను వాడితే ఆరోగ్యానికి మంచిది.
 

ఆడవారిలో మోనోపాజ్ తర్వాత కోరికలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. లైంగిక కోరికలు తగ్గడానికి మొదట వారి మానసిక ఒత్తిడి (Mental stress) కారణం కావచ్చు. అధిక పని ఒత్తిడి, కుటుంబంలోని కలహాలు (Conflicts in the family), శరీరాకృతిలో మార్పులు, వయసు పైబడిన తరువాత కలయికలో పాల్గొంటే ఏమవుతుందో అన్న భయం  ఇలా ఎన్నో కారణాలతో మహిళలలో కోరికలు తగ్గుతాయి.

Latest Videos

click me!