మాంసాహారం ఐరన్ శోషణకు సహాయపడుతుంది:
మాంసాహారం ఐరన్ కి మంచి వనరు మాత్రమే కాదు, ఇతర ఆహారాల నుంచి ఐరన్ ని శోషించుకోవడానికి కూడా సహాయపడుతుంది. కొద్దిగా మాంసాహారాన్ని కూరగాయలతో కలిపి పిల్లలకి ఇస్తే ఐరన్ శాతం పెరుగుతుంది. దీనివల్ల పిల్లలకి రక్తహీనత రాదు.
చికెన్, గుడ్డు, చేపల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఉండే విటమిన్ డి శరీరంలోని నాడీ కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ముఖ్యమైన గమనిక : పిల్లలకి మాంసాహారం మొదట సూప్ లా చేసి ఇవ్వాలి. ఉడికించిన మాంసాన్ని పిల్లలకి ఇవ్వకూడదు. ఎముకలు లేని మాంసాన్ని మాత్రమే ఇవ్వాలి. పిల్లలకి ఇచ్చే మాంసం ఎప్పుడూ తాజాగా ఉండాలి. లేదంటే పిల్లలకి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మాంసం వండే ముందు బాగా కడగాలి.