ప్రతి పేరెంట్స్.. పిల్లలకు కచ్చితంగా నేర్పాల్సిన ఐదు అలవాట్లు ఇవే..!

First Published | Dec 30, 2024, 10:29 AM IST

మంచి అలవాట్లు పిల్లల జీవితం విజయం వైపు అడుగులు వేయడానికి సహాయపడుతుంది. మరి.. చిన్నతనంలోనే పేరెంట్స్ పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం…
 

పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడం కచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యతే. చాలా మంది పేరెంట్స్.. గారాభం పేరుతో పిల్లలను చెడగొడుతూ ఉంటారు. ఇంత చిన్న వయసులోనే అన్నీ నేర్పించాల్సిన అవసరం ఏముంది..? పెద్దైన తర్వాత వాళ్లే నేర్చుకుంటారు లే అని అంటూ ఉంటారు. కానీ.. మొక్కై వంగనిది.. మ్రానై వంగునా అన్నట్లు.. కొన్ని పనులు, అలవాట్లను చిన్నతంలోనే నేర్పించాలి. ఒకేసారి పెద్దయ్యాక వాటిని నేర్చుకోలేరు.

మంచి అలవాట్లు పిల్లల జీవితం విజయం వైపు అడుగులు వేయడానికి సహాయపడుతుంది. మరి.. చిన్నతనంలోనే పేరెంట్స్ పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం…

kids


1.వ్యాయామం…

చిన్నతనం నుంచే పిల్లలతో వ్యాయామం చేసుకునే అలవాటు నేర్పించాలి. కేవలం బరువు తగ్గాలి అనుకునేవాళ్లు మాత్రం  వ్యాయామం చేయాలి అని అనుకుంటారు. కానీ అది తప్పు. పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, శారీరకంగా దృఢంగా పెరగడానికి వ్యాయామం చాలా అవసరం. అంతేకాదు.. రోజూ కాసేపు అయినా వ్యాయామం చేయడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ అలవడుతుంది. వ్యాయామం అంటే.. ఏవేవో అనుకోవద్దు… అవుట్ డోర్ గేమ్స్, డ్యాన్స్ చేయడం, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటివి ఆడించాలి.
 


kids eating

ఆరోగ్యకరమైన ఆహారం:

ఆరోగ్యకరమైన ఆహారం తినే అలవాటు కూడా నేర్పించాలి. ఆరోగ్యం మనం తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. చిన్న వయసులోనే వివిధ రకాల పోషక ఆహారాలు అలవాటుు చేయాలి. హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల.. జంక్ ఫుడ్స్ కి అలవాటు పడకుండా ఉంటారు. జంక్ ఫుడ్స్ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి.. పండ్లు, కూరగాయలు తినడం నేర్పాలి.

మంచి పరిశుభ్రత:

మంచి పరిశుభ్రత పాటించడం అనేది పిల్లలకు వారి జీవితాంతం ఉపయోగపడే అలవాటు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోజూ చేతులు కడుక్కోవడం, పళ్లు తోముకోవడం, స్నానం చేయడం వంటివి నేర్పించాలి. చిన్న వయస్సు నుండి వారి శరీరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి పిల్లలకు నేర్పించడం ద్వారా, మీరు అనారోగ్యాన్ని నివారించడానికి, వారి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లలో నమ్మకంగా ఉండటానికి వారికి సహాయపడవచ్చు.


సమయ నిర్వహణ:

టైమ్ మేనేజ్మెంట్ అనేది కూడా పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాటు. టైమ్ కి స్కూల్ కి వెళ్లడం చిన్నతనంలోనే నేర్పితే.. కాలేజీకి వెళ్లడం, ఆఫీసుకు వెళ్లడం వారికి అలవాటు అవుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలకు రొటీన్‌లను సెట్ చేయడం, షెడ్యూల్‌లను రూపొందించడం, టాస్క్‌లకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో నేర్పడం ద్వారా మంచి సమయ నిర్వహణ అలవాట్లను అభివృద్ధి చేయడంలో సహాయపడగలరు. మొదట్లో పిల్లలకు కాస్త కష్టంగా అనిపించినా…దాని ద్వారా వాళ్లు చాలా నేర్చుకోగలుగుతారు.

kids

దయగల స్వభావం:
ఇతరుల పట్ల దయతో ఉండటానికి పిల్లలకు నేర్పడం అనేది కుటుంబం, స్నేహితులతో వారి సంబంధాలకు ప్రయోజనం కలిగించడమే కాకుండా, సమాజంలో దయగల సభ్యులుగా మారడానికి సహాయపడుతుంది. కేవలం మన గురించి మాత్రమే కాకుండా.. ఇతరుల గురించి కూడా ఆలోచించేలా చేయాలి. దీని వల్ల.. వారు చాలా దయగా ఉండగలుగుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టరు. 

పైన పేర్కొన్న ఈ ఐదు అలవాట్లు కనుక పిల్లలు నేర్చుకుంటే.. వారి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, బాధ్యతాయుతంగా సాగుతుంది. అందుకే వీటిని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
 

Latest Videos

click me!