ఎక్జామ్స్ తర్వాత పిల్లల్ని బిజీగా ఉంచడం ఎలా?

First Published | Mar 14, 2024, 11:45 AM IST

మార్చి, ఏప్రిల్ నెలలోనే పిల్లలందరికీ ఎక్సామ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత పిల్లలకు వేసవి సెలవులు వస్తాయి. అయితే పిల్లలను ఖాళీగా ఉంచడం వారు లేజీగా మారుతారు. అందుకే వారిని బిజీగా ఉంచాలి. ఇందుకోసం తల్లిదండ్రులు కొన్ని పనులు చేయొచ్చు. అవేంటంటే..?

మార్చి, ఏప్రిల్ నెలలో దాదాపుగా పిల్లలకు అన్ని పరీక్షలు అయిపోతాయి. దీంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ సెలవుల్లో కొంతమంది పిల్లలు అమ్మమ్మ, నామ్మమ్మల దగ్గరికి వెళుతుంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతోనే ఉంటారు. కానీ పిల్లల్ని రోజంతా ఇంట్లోనే ఉంచడం వల్ల లేజీగా మారుతారు. అలాగే టీ, ఫోన్ లకు బాగా అడిక్ట్ అయిపోతారు. లేదా రోజంతా ఆడుకుంటూనే ఉంటారు. కానీ ఈ సెలవుల్లో పిల్లలకు తల్లిదండ్రులు కొత్త కొత్త విషయాలను నేర్పొచ్చు. మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందుకే ఎక్సామ్స్ తర్వాత పిల్లల్ని బిజీగా ఉంచడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

వారి అభిరుచిని తెలుసుకోండి 

ప్రతి పిల్లాడికి ఇష్టమైంది ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి పిల్లలకు పెయింటింగ్ వేయడం ఇష్టముంటే.. మరికొందరికి డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది. అందుకే మీ పిల్లల అభిరుచిని బట్టి వారిని ప్రోత్సహించండి. 
 


కొత్త నైపుణ్యాలు 

తల్లిదండ్రులకు తెలియని టాలెంట్ కూడా పిల్లల్లో ఉంటుంది. కానీ చాలా మంది గుర్తించరు. అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు కొత్త నైపుణ్యాన్ని నేర్పించండి. దీని కోసం మీరు స్పెషల్ క్లాసులో చేర్పించొచ్చు కూడా. 
 

బయట ఉండటం

పిల్లలు స్కూళుకు వెళ్లడం, ఇంటికి రావడం, మళ్లీ ట్యూషన్ కు వెళ్లడం,ఇంటికి రావడం ఇవే రిపీట్ అవుతూనే ఉంటాయి. పిల్లలు ఆరుబయట ఆడుకోవడం చాలా తక్కువ. అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్లండి. ప్రకృతితో గడపనీయండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత వరకు ప్రకృతితో గడపమని పిల్లలకు చెప్పండి. రాత్రిపూట ఇంటిపైన కూర్చొని ఆకాశంలోని నక్షత్రాలను చూపించండి. ఉదయం సూర్యోదయాన్ని చూపించండి. పక్షుల కిలకిలారావాలను వినమని చెప్పండి. ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపించొచ్చు. కానీ ఇవి మీ పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 
 

పిల్లలకు మాట్లాడటం నేర్పండి

పిల్లలు స్కూళుకు వెళ్లడం వల్ల తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడలేరు. దీంతో పేరెంట్స్ కు పిల్లల ఇష్టా ఇష్టాలు, ఆకాంక్షలు, ఆశలు, లక్ష్యాలు తెలియవు. అందుకే ఈ సెలవుల్లో అయినా మీ పిల్లలతో మాట్లాడండి. వారి ఇష్టాఇష్టాలను తెలుసుకోండి. అవసరమైనవి నేర్పించండి. మీరు పిల్లలతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తే వారు ఎంతో  ఆనందిస్తారు. అలాగే వారి మనసులో ఉన్న మాటను కూడా చెప్తారు. 
 

ఆన్ లైన్ లో తర్వాతి క్లాస్ గురించి 

సెలవుల తర్వాత పిల్లలు వేరే తరగతికి వెళతారు. అందుకే ఈ సెలవుల్లో వారిని ఖాళీగా ఉంచే బదులుగా తర్వాతి తరగతికి సంబంధించిన విషయాలను నేర్పించండి. ఇందుకోసం యూట్యూబ్ లేదా గూగుల్ లో సెర్చ్  చేస్తే.. సబ్జెక్టుల్లోని కొన్ని అంశాలు వస్తాయి. దీనివల్ల తర్వాతి సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బంది పడరు. 

Latest Videos

click me!