పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోకూడదా..?

First Published | Aug 27, 2021, 2:42 PM IST

నిజానికి పాలు ఇచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే దానిపై తాజాగా నిపుణులు చేసిన పరిశోధనలో వెల్లడైంది. 

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి చాలా కాలం అవుతోంది. ముందుగా.. 40ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు.  ఆ తర్వాత.. 18ఏళ్లు నిండిన వారికి ఇఛ్చారు. ఇప్పుడు టీనేజర్లకు కూడా ఇస్తున్నారు. అయితే.. ఈ వ్యాక్సిన్ ని ఇప్పటి వరకు చాలా మంది తీసుకున్నారు.  అయినప్పటికీ.. ఈ వ్యాక్సిన్ విషయంలో చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి.

గర్భిణీ లు వ్యాక్సిన్ తీసుకోకూడదు.. పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోకూడదంటూ  చాలా అపోహలు ఉన్నాయి.  కొందరు గర్భిణీలైనా వ్యాక్సీన్ తీసుకోవడానాికి ముందుకు వస్తున్నారు కానీ.. పాలు ఇచ్చే తల్లులు మాత్రం బిడ్డకు ఏదైనా అవుతుందేమో అని భయపడుతున్నారు 
 


నిజానికి పాలు ఇచ్చే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే దానిపై తాజాగా నిపుణులు చేసిన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు ఈ విషయంపై పలు పరిశోధనలు చేయగా.. పలు ఆసక్తికర విషయం వెల్లడైంది.  

పాలు ఇచ్చే తల్లులు కూడా ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల.. వారి నుంచి పాల ద్వారా పిల్లలకు కూడా కోవిడ్ కి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

అప్పుడే పుట్టిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు త్వరగా రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. వారికి రోగనిరోధక శక్తి చాలా అసవరం. 

తల్లి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల.. ఆ పాల ద్వారా .. పిల్లలకు రోగనిరోధక శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. పాలిచ్చే తల్లులు ఎలాంటి భయం లేకుండా.. వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెబుతున్నారు.

Latest Videos

click me!