నవజాత శిశువుకు పాలిచ్చేటప్పుడు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

First Published Jun 14, 2021, 2:33 PM IST

మాతృత్వం ఓ అపురూపమైన అనుభవం. ప్రతీ స్త్రీ కోరుకునే అద్భుతమైన అనుభవం.. ఓ చిరు ప్రాణానికి తన కడుపులో ఊపిరిపోయడం, ఆరోగ్యంగా జన్మనివ్వడం నిజానికి ఎంతో కష్టమైన పని. 

మాతృత్వం ఓ అపురూపమైన అనుభవం. ప్రతీ స్త్రీ కోరుకునే అద్భుతమైన అనుభవం.. ఓ చిరు ప్రాణానికి తన కడుపులో ఊపిరిపోయడం, ఆరోగ్యంగా జన్మనివ్వడం నిజానికి ఎంతో కష్టమైన పని.
undefined
అయితే బిడ్డకు జన్మనివ్వడం వరకు ఒకెత్తు అయితే.. పుట్టిన బిడ్డకు సరైన ఫీడింగ్ ఇవ్వడం మరో ఎత్తు. పుట్టిన బిడ్డతో పాటు.. సహజంగా తల్లికి పాలుపడతాయి.
undefined
బిడ్డకు కావాల్సిన అన్ని పోషకాలూ చనుబాలలో ఉంటాయి. కొవ్వులు, ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్లు, ఇంకా అనేక రకాల ముఖ్యమైన మినరల్స్, విటమిన్స్ తల్లిపాలలో ఉంటాయి.
undefined
అందుకే నవజాతశిశువుకు తప్పనిసరిగా ఆరునెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. అయితే కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి అంతా కొత్తే.. పిల్లలకు ఎప్పుడు పాలు పట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికీ అర్థం కాదు.. ఏడ్చిన ప్రతీసారీ ఆకలే అని అర్థం కూడా కాదు.. కాదు.. కొన్ని విషయాలు తెలిస్తే పిల్లలకు పాలు పట్టడం సులువవుతుంది..
undefined
మామూలుగా అయితే నవజాత శిశువుకు ప్రతీ 2 గంటలకో, 4 గంటలకో ఒకసారి పాలు పట్టాల్సి ఉంటుంది. అయితే కొంతమంది పిల్లలు అంతకంటే తక్కువగా అంటే గంటకోసారి పాలు పట్టాల్సి ఉంటుంది. మీ శిశువు ఆకలి మీకు తెలుసు కాబట్టి అది గమనించి పాలిస్తే సరిపోతుంది.
undefined
ఆకలి తట్టుకోలేక గుక్కపట్టి ఏడ్చేవరకు ఆగకుండా... వారు పాలు తాగిన సమయాన్ని బట్టి అంచనాతో పాలు పట్టండి.
undefined
చిట్టి నోటితో.. రొమ్ముపట్టుకుని పాలు తాగడం వారికి కష్టంగా ఉంటుంది. ఒకేసారి తాగలేరు.. నెమ్మదిగా ఒక్కో చుక్కా తాగుతుంటారు. అందుకే వారి బుజ్జికడుపులో పట్టే గుక్కెడు పాలకోసం 30 నుంచి 45 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు. ఇది చాలా విసుగ్గా అనిపిస్తుంది కానీ తల్లికి ఓపికే ముఖ్యం.
undefined
నవజాత శిశువుకు పాలిచ్చేటప్పుడు వారికి ఆ పొజిషన్ సరిగానే ఉందా.. సౌకర్యవంతంగా ఫీలవుతున్నారా లేదా చెక్ చేయండి. అలాంటప్పుడే వారు కడుపునిండా పాలు తాగగలుగుతారు.. లేకపోతే కాసేపటికే ఒదిలేసి.. చికాకు పెడతారు.
undefined
పాలు కారిపోవడం మామూలే. ముఖ్యంగా డెలివరీ అయిన కొద్దిరోజుల్లో చనుబాలు కారిపోవడం.. పాలు ఎక్కువై గడ్డలు కట్టడం సహజమైన విషయమే. కొంతమందికైతే ఇలా రొమ్ములు గడ్డలు కట్టి జ్వరం కూడా వస్తుంది. దీనికి చక్కటి మందు మీ పిల్లలే.. వారు పాలు తాగితే.. మీ బాధ తగ్గిపోతుంది. కాబట్టి కంగారు పడొద్దు.
undefined
పిల్లలు పాలిచ్చే తల్లులు పోషకాహారం మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. తనొక్కదానికే కాదు పిల్లలకు కావాల్సిన పోషకాల్నీ అందించాల్సి ఉంటుంది.
undefined
తొమ్మిదినెలలు కనీమోసిన మీ పిల్లలకు పాలివ్వడం అత్యంత అపురూపమైన విషయం. ఇందులో నొప్పికి తావు లేదు. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా పిల్లలకు పాలిచ్చేటప్పుడు మీకు రొమ్ములో నొప్పి వస్తుంటే.. వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
undefined
click me!