అమ్మ కావాలని ఆశపడుతున్నారా?... ఈ మూలికలు సాయం చేస్తాయి...

First Published | Jun 2, 2021, 12:43 PM IST

మాతృత్వం మహిళలందరూ కోరుకునే వరం. అయితే కొంతమందికి ఇది అంత తొందరగా చిక్కదు. ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలా మీరు కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లైతే.. ఇది మీ కోసమే..

మాతృత్వం మహిళలందరూ కోరుకునే వరం. అయితే కొంతమందికి ఇది అంత తొందరగా చిక్కదు. ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలా మీరు కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లైతే.. ఇది మీ కోసమే..
కొన్ని రకాల మూలికలు మీ ప్రెగ్నెన్సీ ప్రయత్నాన్ని సులభం చేస్తాయి. అలాంటి ఐదు మూలికలు ఇవి...

ఆస్పరాగస్ : దీన్ని స్త్రీలలో పునరుత్పత్తిని పెంచే టానిక్ లా పరిగణిస్తారు. స్త్రీలలో సంతానోత్పత్తికి, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది బాగా సహాయపడుతుంది.
ఆస్పరాగస్ లో అధిక మొత్తంలో ఫైటోఈస్ట్రోజెన్‌ లు ఉంటాయి. అంతేకాదు ఈస్ట్రోజెన్‌లతో సమానమైన రసాయన నిర్మాణాన్ని కలిగి ఉన్న సహజ సమ్మేళనాల సమూహం ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది పునరుత్పత్తి చక్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఒత్తిడిని తగ్గించడం ద్వారా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. మెనోపాజ్ లక్షణాలు తగ్గించడానికి, బాలింతల్లో పాలఉత్పత్తిని పెంచడానికి కూడా బాగా పనిచేస్తుంది.
విథానియా సోమ్నిఫెరా (అశ్వగంధ) : పురుషులలో సంతానోత్పత్తి సమస్యల చికిత్సకు అశ్వగంధ సాంప్రదాయకంగా వాడుతున్నారు. ఇది వీర్యం నాణ్యత, అంగస్తంభన, స్పెర్మ్ కౌంట్ ను మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
మానసిక నపుంసకత్వం, వివరించలేని వంధ్యత్వం వంటి డిసార్డర్లు ఉన్న పురుషుల్లో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
ఆగ్నస్ కాస్టస్ (చాస్టెబెర్రీ) : పునరుత్పత్తి హార్మోన్లను సమతుల్యం చేసి, రుతుచక్రాన్ని క్రమబద్దీకరించడంతో అగ్నస్ కాస్టస్ బాగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడంలో సమస్యలు తలెత్తుతాయి.
బ్లాక్ కోహోష్ : మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఈ మూలిక అండాశయాలను ఉత్తేజపరచడం ద్వారా అండోత్పత్తిని పెంచుతుందని నమ్ముతారు.
చైనీస్ మూలికలు : ఇతర సంతానోత్పత్తి మందులతో పాటు తీసుకుంటే చైనీస్ మూలికలు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని అంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. వీటిని వేరే మందులతో కాకుండా విడిగా.. ఒక్కటే వాడినప్పుడు సంతానోత్పత్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది ఇంకా పరీక్షించబడలేదు. నిరూపించబడలేదు.

Latest Videos

click me!