Parenting Tips: మీ పిల్లలు రోజూ ఫోన్ చూస్తున్నారా? భవిష్యత్తులో జరిగేది ఇదే..!

Published : Jul 25, 2025, 03:38 PM IST

ఒక రోజులో ఐదు గంటలకు పైగా ఫోన్లు వాడే పిల్లల్లో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

PREV
14
పిల్లలు ఫోన్ చేస్తే...

ప్రస్తుత కాలంలో అందరి జీవితాల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఒక అనివార్యం అయిపోయింది. ఫోన్ లేని వాళ్లు ఉండటం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. పెద్దవాళ్లు మాత్రమే కాదు.. పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్నారు. గేమ్స్ ఆడటానికి, సోషల్ మీడియా వాడటం కోసం, రీల్స్ చూడటం కోసం.. ఇలా కారణం ఏదైనా పిల్లల్లో ఫోన్ల వాడకం చాలా ఎక్కువ అయ్యింది. పిల్లలు మాట వినడం లేదనో, ఏడుస్తున్నారనో, అన్నం తినడం లేదనో... పేరెంట్స్ స్వయంగా పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారు. కానీ, దీని వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా మారుతుందో తెలుసా? ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

ఒక రోజులో ఐదు గంటలకు పైగా ఫోన్లు వాడే పిల్లల్లో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 163 దేశాల్లో నిర్వహించిన ఓ పరిశోధనలో సుమారు 20 లక్షల మంది పిల్లలను పరిశీలించారు. ఈ పరిశోధనలో సోషల్ మీడియా వాడకం, శారీరక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించారు.

24
పిల్లల్లో మానసిక సమస్యలు..?

ఫోన్లు ఎక్కువగా వాడే పిల్లల్లో శారీరక సమస్యలు మాత్రమే కాదు, మానసిక సమస్యలు కూడా వస్తున్నట్లు గుర్తించారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉన్న యువతలో ఈ స్మార్ట్ ఫోన్ ల కారణంగా దాదాపు 48 శాతం మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇక 13 ఏళ్లకే సోషల్ మీడియా వాడకం ప్రారంభించిన వారిలో 28 శాతం మంది మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. సాధారణంగా రోజుకి 3 గంటలకు పైగా ఫోన్ వాడే వారిలో 31 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.ఇక.. 13 ఏళ్ల లోపు పిల్లల్లో అయితే ఈ సమస్యలు 20 శాతం వరకూ ఉన్నట్లు తేలడం గమనార్హం.

34
ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల పిల్లల్లో వచ్చే సమస్యలు...

స్మార్ట్ ఫోన్ లలో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు, మానసిక సమస్యలు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, ఇతరులతో కలవకపోవడం, సామాజిక సంబంధాల్లో సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. నిద్రలేమి, చెడు అలవాట్లకు బానిసలుగా మారే అవకాశం కూడా ఉంది.

నిపుణుల హెచ్చరిక

బాల్యదశలోనే సోషల్ మీడియా వాడకం పెరిగితే, అది మానసిక అభివృద్ధిని దెబ్బతీయడమే కాకుండా, విద్యపై దృష్టి మందగించడానికి, బలహీనతలకు గురయ్యేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్లు, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టి, వారి డిజిటల్ వినియోగాన్ని పరిమితం చేయాలని సూచిస్తున్నారు.

44
తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు

పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించండి: రోజుకు 1–2 గంటలకు మించి స్క్రీన్ టైమ్ ఇవ్వవద్దు. ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఇవ్వడం ఒక ‘రివార్డ్’ లా కాక, ఒక ‘రిస్ట్రిక్షన్’గా చూడాలి.

ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్‌కి ప్రోత్సాహం ఇవ్వండి: పుస్తకాలు చదవడం, ఆటలు ఆడటం, కళలు నేర్చుకోవడం వంటి గుణాత్మ పనుల్లో పిల్లలను నిమగ్నం చేయండి.

నైట్ టైం స్క్రీన్ పూర్తిగా ఆపండి: పడుకునే ముందు స్క్రీన్ వాడకం వల్ల నిద్రలేమి, మెదడుకు విశ్రాంతి లేకపోవడం జరుగుతుంది.

సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారో తెలుసుకోండి: పిల్లలు ఏ యాప్‌లు వాడుతున్నారో, వాళ్లకు ఎలాంటి కంటెంట్ కనిపిస్తున్నదో పరోక్షంగా గమనించండి.

మీరు స్వయంగా ఆదర్శంగా ఉండండి: తల్లిదండ్రులు ఎక్కువసేపు ఫోన్ వాడితే, పిల్లలు అదే మాదిరిగా ఫాలో అవుతారు. కాబట్టి, పిల్లల ముందు మీరు ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.

Read more Photos on
click me!

Recommended Stories