పిల్లలకు తలనొప్పి ఎందుకు వస్తుంది? తగ్గడానికి ఏం చేయాలి?

First Published | Mar 29, 2024, 9:45 AM IST

పెద్దలకే కాదు పిల్లలకు కూడా అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. కానీ పిల్లలకు తలనొప్పి ఎందుకు వస్తుందని చాలా మంది తల్లిదండ్రులకు డౌట్ వస్తుంటుంది. అసలు పిల్లలకు తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? 

headache in children

గజిబిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరికీ తలనొప్పి రావడం చాలా కామన్ అయిపోయింది. అయితే పెద్దలకు తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలుంటాయి. ఒకటి స్ట్రెస్ లేదా బీపీ. కానీ ఈ రోజుల్లో పిల్లలకు కూడా తలనొప్పి వస్తోంది. కానీ పిల్లలకేంటి తలనొప్పి అని చాలా మంది వాపోతుంటారు. అసలు పిల్లలకు తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

headache


పిల్లలకు తలనొప్పి ఎందుకు వస్తుంది?

1. పిల్లలకు తలనొప్పి రావడానికి ఒత్తిడి ప్రధాన కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. నిజానికి కొంతమంది పిల్లలు చదువు గురించి చాలా ఒత్తిడికి గురవుతుంటారు. దీనివల్లే పిల్లలకు తలనొప్పి రావడం ప్రారంభమవుతుంది. కొన్ని కొన్ని సార్లు పిల్లలతో తల్లిదండ్రుల ప్రవర్తన కూడా ఒత్తిడి, తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. 
 

Latest Videos


headache

2. అలాగే పిల్లలకు తలనొప్పి రావడానికి మైగ్రేన్ కూడా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ప్రకాశవంతమైన కాంతి లేదా ఎక్కువ సౌండ్ వల్ల కూడా తలనొప్పి బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి దీనివల్ల వాంతులు కూడా అవుతాయి. 

headache children

3. పిల్లలు ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ను చూస్తే కూడా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే ఇది కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది బాగా నొప్పిని కలిగిస్తుంది. అందుకే పిల్లలను ఎలక్ట్రానిక్ గార్జెట్లను ఎక్కువ సేపు చూడనీయకూడదు. మీ పిల్లలు చాలా కాలంగా తలనొప్పితో బాధపడుతున్నట్టైతే ఐ చెకప్ చేయించుకోవాలి. చాలా సార్లు కంటి చూపు మందగించడం వల్ల తలనొప్పి సమస్య వస్తుంది.

headache in children

4. కొంతమంది పిల్లలకు రాత్రిపూట లేట్ గా పడుకునే అలవాటు ఉంటుంది. మీకు తెలుసా? నిద్ర లేకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మీ పిల్లవాడు తలనొప్పితో బాధపడుతున్నట్టైతే మీ పిల్లలు కంటినిండా నిద్రపోయేలా చూడాలి. 

5. పోషకాహార లోపం వల్ల కూడా పిల్లలకు తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి కారణమవుతుంది. అందుకే పిల్లలకు సరైన ఆహారాన్ని పెట్టండి. అలాగే శరీరం హైడ్రేట్ గా ఉండేందుకు నీళ్లను బాగా తాగించండి. అయినా తలనొప్పి అలాగే వస్తుంటే ఖచ్చితంగా హాస్పటల్ కు తీసుకెళ్లండి.

click me!