పిల్లలు ఫోన్ ను ఎక్కువగా చూస్తే ఏమౌతుందో తెలుసా?

First Published Mar 27, 2024, 1:02 PM IST

ప్రస్తుత కాలంలో పిల్లలు కూడా ఫోన్లను తెగ వాడేస్తున్నారు. కొంతమంది పిల్లలైతే ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారు. పిల్లలు ఫోన్లుచూస్తే తమ పనులకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదని తల్లిదండ్రులు కూడా చూసి చూడనట్టుగానే వదిలేస్తారు. కానీ పిల్లలు ఫోన్లు చూడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా? 
 


నేటి కాలంలో.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు అన్నీ మనం కూర్చున్న చోట నుంచే సెల్ ఫోన్ తోనే జరుగుతున్నాయి. వీటివాడకం వల్ల పనులన్నీ ఈజీగా అయిపోయినట్టుగా అనిపించినా.. మీకు తెలియకుండానే మీరు సోమరులుగా మారిపోతారు. అలాగే సెల్ ఫోన్లకు బానిసలు అవుతారు. కరోనా కంటే ముందు పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇచ్చేవారే కాదు. కానీ కరోనా కాలం మొదలైనప్పటి నుంచి ఆన్లైన్ క్లాసుల వల్ల స్కూల్, కాలేజీ పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. అసలు సెలఫోన్లను ఎక్కువగా చూసే పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

kids mobile use

పిల్లలకు సెల్ ఫోన్లు ఎందుకు ఇవ్వకూడదు? 

పిల్లలే కాదు పెద్దలు కూడా ఫోన్లను ఎక్కువగా వాడకూడదు. అయితే చాలా మంది చిన్నపిల్లలు ఏడుపు ఆపడానికి సెలఫోన్లను అలవాటు చేస్తారు. కానీ ఈ సెల్ ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం పిల్లల ఆరోగ్యానికి చాలా డేంజర్ అని  వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు ఫోన్లను ఇచ్చి అన్నం తినిపించేవారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మనుషులకు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు. ఎందుకంటే పిల్లల మెదడు పెద్దల మెదడు కంటే రెట్టింపు రేడియేషన్లను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
 


సెల్ ఫోన్ దుష్ప్రభావాలు

సెల్ ఫోన్ నుంచి వెలువడే యూవీ కిరణాలు పిల్లల కళ్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల నిద్రలేమి, మెదడు పనితీరు తగ్గడం, జ్ఞానం, కొన్నిసార్లు పిల్లల ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలేమీ తెలియక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఏడుపును ఆపడానికి ఫోన్ ను ఇస్తారు. సెల్ ఫోన్ ను ఎక్కువగా చూసే  పిల్లల్లో మాట్లాడటంలో ఆలస్యం, మానసిక వైకల్యం, గందరగోళం, ఆలోచనా లోపం, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఊబకాయం, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.
 

సెల్ ఫోన్ వాడకం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినా.. నేడు ఈ సెల్ ఫోన్ వాడకం అనివార్యంగా మారింది. కానీ పిల్లలకు దీన్నిఎక్కువగా ఇవ్వడాన్ని మాత్రం ఖచ్చితంగా ఆపాలి. ఒక నిర్ణీత సమయం ఆడుకోవడానికి మీ పిల్లలకు ఫోన్ ఇవ్వొచ్చు. అంటే సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు రోజుకు ఒకటి లేదా రెండు గంటలు వాడుకోవచ్చు. అలాగే ఆదివారాలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఫోన్ దగ్గరకు పిల్లల్ని పోనీయకండి. దీనికి బదులుగా తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర్లో ఉండే పార్కు లేదా బీచ్ కు తీసుకెళ్లొచ్చు.

click me!