పిల్లల్ని కొడుతున్నారా..? ఏమౌతుందో తెలుసా?

First Published | Feb 21, 2024, 10:40 AM IST

పిల్లలు కుదురుగా ఒక్కదగ్గర ఉండరు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ పిల్లల చేష్టలు కొన్ని కొన్ని సార్లు విసుగు పుట్టిస్తాయి. చెప్పిన మాట వినకపోయే సరికి పిల్లల్ని కొడుతుంటారు. కానీ పదేపదే పిల్లల్ని కొట్టడం అంత మందిచి కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? 
 

పిల్లల్నిఅతిగా ముద్దు చేయడం, గారాబం పెట్టడం, మందలించడం ప్రమాదకరం. కానీ పిల్లల చేష్టలు కొన్ని కొన్ని సార్లు కోపం తెప్పిస్తాయి. ఇంకేముంది పిల్లలు కుదురుగా ఉండాలని, చెప్పిన మాట వినాలని తిట్టి కొడుతుంటారు తల్లిదండ్రులు. అలాగే చదవడం లేదని స్కూల్లో టీచర్లతో పాటుగా ఇంట్లో పేరెంట్స్ కూడా కొడుతుంటారు. కానీ పిల్లల్ని ఎప్పుడూ కొట్టడం అస్సలు మంచిది కాదు. అసలు మీరు పిల్లల్ని కొడితే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. 
 

రిలేషన్ షిప్ లో గ్యాప్..

మన చుట్టూ జరిగే ప్రతిదీ మనపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు పిల్లల్ని కొట్టినప్పుడు వాళ్లు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. దీనివ్లల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. అలాగే పిల్లలకు మేమంటే మా పేరెంట్స్ కు ఇష్టం లేదనే భావన కూడా కలుగుతుంది. 
 

Latest Videos


మాటలు వినకపోవడం 

చిన్న తప్పు, పెద్ద తప్పు అంటూ పిల్లల్ని తల్లిదండ్రులు కొడుతూనే ఉంటారు. కానీ మీరు తరచుగా కొడుతూనే ఉంటే పిల్లలకు మీపై భయం పోతుంది. మీరంటే భయం ఉండదు. ఫలితంగా మీరు చెప్పే మాటలను పిల్లలు వినరు. పట్టించుకోరు. అందుకే తప్పు చేస్తే పిల్లల్ని కొట్టకుండా ఏం చేయాలనే దాని గురించి ఆలోచించండి. కొట్టడానికి బదులుగా ప్రేమతో వారి తప్పులను చెప్పండి. 
 

పరధ్యానం

పిల్లల్ని ఎప్పుడూ కొట్టడం వల్ల వారు పరధ్యానంగా ఉంటారు. ఈ పిల్లల్లో పరిశీలనా శక్తి అభివృద్ధి చెందదు. అంటే దేని గురించి వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. దీంతో వారు ఏ సబ్జెక్టుపైనా దృష్టి పెట్టలేక, ఏ పని చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల  మీ పిల్లలు చదువులో వీక్ గా ఉంటారు. 
 

స్వభావంలో మార్పు

పిల్లలు తల్లిదండ్రులను చూసే ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. అంటే తమ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారు?ఒకరితో ఒకరు ఉండే విధానం, వారు ఇచ్చే గౌరవం వంటివి బాగా గమనిస్తారు. వీటినే ఫాలో అవుతారు కూడా. ముఖ్యంగా చెడు ప్రవర్తన పిల్లల్ని బాగా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు వారు కారణం లేకుండా కోపంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు.
 

అపనమ్మకం

పిల్లలను కొట్టడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పోతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఇతరులతో మాట్లాడేందుకు, స్టేజ్ పై తమ ప్రతిభను ప్రదర్శించడానికి భయపడుతుంటారు. ఆత్మవిశ్వాసం లేకపోతే పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 

click me!