పిల్లలపై గట్టిగా అరుస్తున్నారా..? ఏమౌతుందో తెలుసా?

First Published | Feb 20, 2024, 12:22 PM IST

అంతెందుకు పిల్లలపై కోపంలో అలా అరిచేసిన కాసేపటికి మీరు కూడా ఎందుకు అరిచామా అని బాధపడే ఉంటారు. అయితే.. అలా జరగకుండా ఉండాలంటే.. అరవకపోయినా అప్పటి పరిస్థితిని హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Parents

చాలా మంది పేరెంట్స్.. తమ పిల్లలు తమ మాటే వినాలి అని అనుకుంటారు. వినకపోతే వాళ్లమీద అరుస్తూ ఉంటారు.  ఒక్కసారి రెండు సార్లు అంటే పిల్లలు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రతి విషయంలోనూ అరుస్తూనే ఉంటారు. మనం అరిస్తేనే వాళ్లు మాట వింటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ, ప్రతి విషయంలో పిల్లలపై అలా అరవడం వల్ల వారి మనసు చాలా గాయపడుతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది ముందు అరిచినప్పుడు వారు మరింత ఎక్కువ బాధపడతారు. అంతెందుకు పిల్లలపై కోపంలో అలా అరిచేసిన కాసేపటికి మీరు కూడా ఎందుకు అరిచామా అని బాధపడే ఉంటారు. అయితే.. అలా జరగకుండా ఉండాలంటే.. అరవకపోయినా అప్పటి పరిస్థితిని హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

parents

1.వాళ్లు చెప్పేది వినండి..

పిల్లల మీద మీరు అరవకూడదు అనుకుంటే.. ముందు మీ పిల్లలు చెప్పేది వినండి. వాళ్లు ఏదే చేసేస్తున్నారు అని ముందుగానే అరవకుండా.. జరిగింది ఏంటి అనే విషయం మీ పిల్లలతో కూల్ గా మాట్లాడి తెలుసుకోండి. వారు మీ దగ్గర కంఫర్ట్ గా వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ చెప్పుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. వాళ్లు చెప్పేది మీరు మంచిగా వింటారు అర్థం చేసుకుంటారు అని అనిపించినప్పుడు.. పిల్లలు కూడా బుద్ధిగా మీరు చెప్పినట్లు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

Latest Videos


2.అంచనాలు పెట్టుకోవడం...
చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలపై ఎక్కువెక్కువ అంచనాలు పెట్టుకుంటారు. వాళ్లు పెట్టుకున్న అంచనాలకు పిల్లలు అందుకోనప్పుడు పేరెంట్స్ లో ఫ్రస్టేషన్ వస్తుంది. ఆ ఫ్రస్టేషన్ మొత్తాన్ని పిల్లలపై అరుస్తూ తీర్చుకుంటారు. నీకు అది చేత కాదు.. ఇది చేత కాదు... ఆ మాత్రం కూడా చేయలేవా అని అనేస్తూ ఉంటారు. అలా పిల్లలను అనడం మానేయండి. అందరు పిల్లలకు ఒకేలాంటి సామర్థ్యం ఉండదు. కాబట్టి.. వారి సామర్థ్యానికి తగిన అంచనాలు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు ఇలా వాళ్ల మీద అరిచి.. వాళ్లను బాధపెట్టి.. మీరు బాధపడే అవసరం ఉండదు.

parents crying

3.వాళ్ల ఎమోషన్స్ అర్థం చేసుకోండి..
తరచుగా, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనకు సంబంధించిన అంతర్లీన భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిస్పందిస్తారు. ప్రవర్తన , దాని వెనుక ఉన్న భావోద్వేగాల మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. కేవలం ప్రతికూల ప్రవర్తనపై దృష్టి పెట్టే బదులు, మీ పిల్లల చర్యలకు గల మూలకారణాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. వారు నిరుత్సాహంగా, అలసటగా లేదా నిరుత్సాహంగా ఉన్నారా?  అవగాహనతో అంతర్లీన భావోద్వేగాలను పరిష్కరించడం ద్వారా, మీరు మీ పిల్లల భావాలను , ప్రవర్తనలను మరింత ప్రభావవంతంగా నియంత్రించడంలో సహాయపడవచ్చు.

parents


4. మంచి, చెడు లేబులింగ్ చేయద్దు.. 

మీ పిల్లల ప్రవర్తనను ఖచ్చితంగా మంచి లేదా చెడుగా వర్గీకరించడానికి బదులుగా, మరింత సూక్ష్మమైన విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. ప్రవర్తన స్పెక్ట్రమ్‌లో ఉందని గుర్తించండి. ప్రతి చర్య అదే స్థాయి ప్రతిచర్యకు హామీ ఇవ్వదు. వెంటనే కేకలు వేయడానికి బదులుగా, కాసేపు సమయం తీసుకుండి. కాసేపటి తర్వాత.. వారితో ప్రశాంతంగా మాట్లాడండి. వారు చేసిన పనులకు నువ్వు చెడ్డవాడివి అనే ముద్ర మనం వేయకూడదు. చాలా మంది ప్రతి విషయంలో ఇలా చేయకపోతే నువ్వు బ్యాడ్ అయిపోతావ్ అని పదే పదే ఆ మాటలను పిల్లలతో చెబుతూ ఉంటారు. వారిపై అలాంటి లేబులింగ్ వేయకుండా.. సమస్యను వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి.
 

click me!