మంచి పేరెంట్స్ కావాలనుకుంటున్నారా? మీరు చేయాల్సింది ఇదే.. !

First Published | Feb 20, 2024, 12:01 PM IST

తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలైపోవాలి. అలాగే పిల్లలతో మంచి సమయాన్ని గడపాలి. పనిలో పడి పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తే మీకు, పిల్లల మధ్య సంబంధం బలహీనపడుతుంది. 
 

తల్లిదండ్రులు కావడం, పిల్లలను పెంచడం చాలా కష్టమైన పని. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పేరెంట్స్ గా ఉండాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు అయినంత మాత్రం బెస్ట్ పేరెంట్స్ అయిపోలేరు. బెస్ట్ పేరెంట్స్ కావాలంటే మీరు కొన్ని పనులను చేయాలి. మీ లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చుకోవాలి. పిల్లలకు ఇష్టమైన విషయాలన్నీ పక్కన పెట్టకూడదు. ఇవన్నీ మీరు పాటిస్తే సమాజంలో పిల్లలను ఉత్తమంగా పెంచొచ్చు. ఏదేమైనా తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడం అంత సులభమైతే కాదు. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కలిసి ఆడటం

తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలైపోవాలి. అంటే మీరు చిన్నప్పుడు ఏం చేశారు? మీరు మీ తల్లిదండ్రుల నుంచి కోరుకునేవారో అవన్నీ మీరు మీ పిల్లలకు అందించాలి. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఆడుకోవాలనుకుంటారు. అందుకే మీరు మీ పిల్లలతో ఆడలు ఆడండి. కలిసి పాటలు పాడటం, డ్యాన్స్ చేయొచ్చు. అలాగే.. హస్తకళలు చేయొచ్చు. ఓడలు చేసి నీటిలో ఇడవొచ్చు. ఇవన్నీ మీ పిల్లలకు మిమ్మల్ని ఫ్రెండ్స్ గా చేస్తాయి. మీరు పిల్లలతో ఇలా ఉంటే వారు మీతో అన్ని విషయాలను పంచుకుంటారు. 
 

Latest Videos


పిల్లల బాధలు వినడం

పిల్లలకు ఏం బాధలుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ పిల్లలు కూడా శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. పనిభారం ఎక్కువగా ఉన్నా.. మీ పిల్లలు ఏదైనా చెప్పడానికి వస్తే.. వారి మాటలను వినండి. ముఖ్యంగా వారిపై అనవసరంగా అరవకుండా ఉండండి. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వారు దాచుకోలేరు. కాబట్టి వారు చెప్పేది వినండి. ఇది పిల్లలు, తల్లిదండ్రులకు సాధికారతను ఇస్తుంది. ఇది వారికెంతో భారాన్ని తగ్గిస్తుంది. ఇది పిల్లలపై లైంగిక వేధింపులను నివారించడంలో వారికి సహాయపడుతుంది.
 

హద్దులు నిర్ణయించడం

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత స్వతంత్ర వాతావరణాన్ని సృష్టించినా..  హద్దులను కూడా నిర్ణయించాలి. పిల్లలు ఏం చేయాలి? ఏం చేయకూడదు వంటి ఎన్నో విషయాలను నేర్పించాలి. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు హద్దులు నిర్ణయించినప్పుడు.. వాళ్లు దేని గురించి కోపగించుకుంటారు? వాళ్లకు ఏది నచ్చదు? వాళ్లు దేని గురించి అహంకారపూరింతంగా ఉంటారో సులువుగా తెలుసుకోవచ్చు. 

parenting

పాఠాలు చెప్పడం

ఆఫీసు పని, ఇంటి పనుల వల్ల పిల్లలకు నేర్పించడం తల్లిదండ్రులకు సవాలుతో కూడుకున్న పని. అందుకే చాలా మంది స్కూల్ అయిపోగానే ట్యూషన్లకు పంపుతున్నారు. కానీ ఇది మంచిది కాదు. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు వీలైనంత ఎక్కువగా నేర్పించాలి. వాళ్లకేం కావాలి? వాళ్లు ఏం కావాలనుకుంటున్నారు? అనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల్లో సహకారం పిల్లలకు తల్లిదండ్రుల పట్ల నమ్మకాన్ని,  గౌరవాన్ని పెంచుతుంది. 
 

ప్రజాసమస్యల గురించి..

పిల్లలతో కుటుంబం, పాఠశాల పని గురించి మాత్రమే మాట్లాడటం వల్ల వారు ప్రతిదీ తెలుసుకోలేరు. అందుకే చిన్నతనం నుంచే వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం పిల్లలకు నేర్పించండి. వారానికి ఒక్కసారైనా ఏదో ఒక అంశంపై మాట్లాడటం మీ పిల్లలకు నేర్పించండి. ఈ అలవాటు మీ పిల్లల భయాలను తగ్గిస్తుంది. తల్లిదండ్రుల పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. 

Parenting

దీనితో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూర్చుని వారానికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలి. ఏ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది? ఏది బెటర్? ఏది మంచిది కాదు వంటి విషయాలను చెప్పాలి. ఎంత పనిఉన్నా.. అలసిపోయినా పై విషయాలను ఎప్పుడూ బోధిస్తే తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం బలపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

click me!