మీరు పిల్లల్ని కొట్టే తల్లిదండ్రులా? దీనివల్ల మీ పిల్లలు ఎలా అవుతారో తెలుసా?

First Published | Mar 30, 2024, 12:00 PM IST

పిల్లల్ని కొడితే, తిడితే సెట్ అవుతారు, మాట వింటారు అనుకోవడం మీ పొరపాట్లే. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే..
 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమ శిక్షణతో పెంచాలనుకుంటారు. కానీ ఇది అంత సులువైన విషయం కాదన్న ముచ్చట ప్రతి తల్లిదండ్రులకు తెలుసు. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవంతో బతకడం కోసం ప్రతి తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో బరువు, బాధ్యతలను మోపుతుంటారు. వారి చెప్పినట్టు చేయనప్పుడు పిల్లలపై అరవడమో, వారిని కొట్టడమో, కోపగించుకోవడమే చేస్తుంటారు. ఇది చాలా కామన్ విషయం. 


పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి కొంతమంది తల్లిదండ్రులు వారిని కొడుతుంటారు. అలాగే కఠినమైన ఆంక్షలు విధిస్తుంటారు. కానీ ఇలాంటి పనులు చేయడం తల్లిదండ్రుల వైఫల్యానికి దారితీస్తుంది. దీనివల్ల పిల్లలు తప్పుడు మార్గంలోకి వెళతారని నిపుణులు అంటున్నారు. 
 


పిల్లల్ని ఎందుకు కొడతారు?

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లల్ని కొట్టాలని ఉండదు. అలా కొట్టడానికి చేయి కూడా రాదు. కానీ పిల్లలు తల్లిదండ్రుల మాటలు విననప్పుడు, చెడు పనులు చేసినప్పుడు, చిలిపి చేష్టలు చేసినప్పుడు, చెడు మాటలు మాట్లాడినప్పడు కోపం వచ్చి కొడుతుంటారు. క్రమశిక్షణలో ఉంచడం కోసం తల్లిదండ్రులు ఈ పద్దతిని ఎంచుకుంటారు. చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా పిల్లలను కొట్టడం చాలా మంది తల్లిదండ్రులకు అలవాటు. 

ఇతరులకు అవకాశం ఇవ్వకండి

పిల్లలను కొట్టడం లేదా వారిపై అరవడం వల్ల పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు, మాట వింటారు అనుకోవడం చాలా సహజం. కానీ దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. పిల్లలు మీ  మాట వినాలన్నా, మంచి ప్రవర్తనను కలిగి ఉండాలన్నా తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన మొదటి పని పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారో వారితో కూర్చొని వివరంగా చెప్పండి. ముఖ్యంగా ఎదుటివారి ముందు మీ పిల్లలతో ఇలాంటి డిస్కషన్ పెట్టకూడదు. అలాగే వారిని ఇతరుల ముందు తిట్టడం, కొట్టడం అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ పిల్లలు మానసికంగా దెబ్బతింటారు. మీ వల్ల మీ పిల్లల్ని ఇతరులు కూడా తిట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులకు ఆ అవకాశం ఇవ్వకండి.

తప్పుడు మార్గం..

పిల్లలను కొట్టే పని వారిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. మీరు మీ పిల్లల్ని పదేపదే కొట్టినప్పుడు వారు మిమ్మల్ని చూసి భయపడతారు. అలాగే తప్పుడు మార్గంలో వెళతారు. మీరు ఇలా కొట్టడం వల్ల నేను ఏం చేసినా తప్పే, నేను మంచి వాడిని కాదు, చెడ్డవాడిని అని ప్రతి పిల్లవాడికి అనిపిస్తుంది. అందుకే పిల్లల తప్పుచేసినప్పుడు వారిని కొట్టకుండా వీలైనంత దయతో మాట్లాడటానికి ప్రయత్నించండి. తప్పొప్పుల గురించి చెప్పండి. 
 

ఆత్మవిశ్వాసం కోల్పోవడం

ప్రతి పిల్లవాడికి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వీళ్లు తప్పకుండా ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు. ఇంతకంటే ముందు ఫెయిల్ కావొచ్చు. కానీ ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ ఇలా ఎందుకు చేస్తున్నవ్, ఎవరు చేయమన్నరు? అంటూ పిల్లలపై ప్రశ్నల వర్షం కురిపిస్తే వారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం అవుతారు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పోతుంది. 


కోపం పెరుగుతుంది

క్రమశిక్షణతో పెంచాలనుకునే తల్లిదండ్రులు పిల్లలు బాగా కొడుతుంటారు. కానీ ఇలా కొట్టడం వల్ల పిల్లలు మొదట్లో సైలెంట్ అయిపోతారు. కానీ తల్లిదండ్రులు వారిని ఎప్పుడూ కొట్టడం అలవాటు చేసుకుంటే పిల్లల్లో కోపం పెరుగుతుంది. ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య విభేదాలకు కారణమవుతుంది.
 

Latest Videos

click me!