పిల్లలు బరువు పెరగడం లేదా..? ఈ ఫుడ్స్ పెట్టండి..!

First Published | Feb 16, 2024, 4:41 PM IST

వారి వయసు తగిన బరువు పెరగరు. బక్క పలచగా ఉండిపోతూ ఉంటారు. అయితే.. మీ పిల్లలు బరువు పెరిగి.. ఆరోగ్యంగా ఉండాలి అంటే.. వారి డైట్ లో ఈ కింది ఆహారాలను భాగం చేయండి.

Kids food


తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మంచి మంచి ఆహారం తినిపంచాలని అనుకుంటారు. కానీ పిల్లలు సరిగా తినరు. దీంతో.. అనారోగ్యం బారినపడుతూ ఉంటారు. అంతేనా... వారి వయసు తగిన బరువు పెరగరు. బక్క పలచగా ఉండిపోతూ ఉంటారు. అయితే.. మీ పిల్లలు బరువు పెరిగి.. ఆరోగ్యంగా ఉండాలి అంటే.. వారి డైట్ లో ఈ కింది ఆహారాలను భాగం చేయండి.


పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగాలంటే వారికి సరైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ఆకలి లేకపోవడం, తక్కువ తినడం పిల్లల ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అలా అయితే, పిల్లల బరువు పెరగడానికి ఎంత ఆహారం ఇవ్వాలి అనే విషయం తెలుసుకోవాలి.


potato


1.బంగాళదుంపలు
పిల్లలు ఖచ్చితంగా బంగాళాదుంపలను చాలా ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బంగాళదుంపలో కేలరీలు, అమైనో ఆమ్లాలు , డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. దీనివల్ల. పిల్లలు త్వరగా బరువు పెరుగుతారు.


2.అరటిపండ్లు..
మంచి మొత్తంలో శక్తిని ఇచ్చే పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో 105 కేలరీలు ఉంటాయి. ఇది పిల్లలకు పచ్చి రూపంలో, మిల్క్ షేక్ లేదా రసంలో ఇవ్వవచ్చు.
 

egg


గుడ్లు
గుడ్లు మంచి మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు , పోషకాలను కలిగి ఉంటాయి. ఎదిగే శిశువులకు ఇవి చాలా అవసరం. అంతే కాదు, పిల్లలు వారి వయస్సుకు తగిన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. కానీ పిల్లలకు ఉడకబెట్టిన గుడ్లు ఇవ్వడం మంచిది.

nuts


గింజలు
పిల్లల్లో బరువు పెరగడానికి డ్రై ఫ్రూట్స్ , నట్స్ చాలా సహాయపడతాయి. ఇందులో మంచి పోషకాలు, చక్కెర , శక్తి ఉన్నాయి. ఇది పిల్లలకు ఆరోగ్యంతోపాటు.. బరువు పెరగడానికి సహాయడతాయి.

milk product


పాల ఉత్పత్తులు
ఎదిగే పిల్లల ఆహారంలో పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులు ఉండాలి. ఇందులోని క్యాల్షియం ఎముకలను దృఢపరిచి, ఎదుగుదలకు తోడ్పడుతుంది. వెన్న బరువు పెరగడానికి సహాయపడుతుంది.


చికెన్
పౌల్ట్రీ మాంసం ప్రోటీన్ , కేలరీలకు మంచి మూలం. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. అంతే కాదు, పిల్లలు మరింత ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది.
 

peanut butter


పీనట్ బటర్..
పీనట్ బటర్ తినడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూరగాయలు లేదా పండ్లతో తీసుకోవాలి. కానీ అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదు.

Latest Videos

click me!