పిల్లలు వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడితే ఏమౌతుంది?

First Published | Feb 16, 2024, 2:12 PM IST

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. చాలా మంది వీడియో గేమ్స్ ను విచ్చలవిడిగా ఆడుతుంటారు. కానీ వీడియో గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ లో ఎక్కువ సేపు గడపడం వల్ల చాలా మంది మానసిక క్షోభకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఈ అలవాటు మీ పిల్లల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం జనాల్లో బాగా పెరిగిపోయింది. పెద్దలేంటి.. చిన్న పిల్లలు కూడా ఫోన్లను తెగ వాడేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియా, వీడియో గేమ్స్ లో ఎక్కువ సేపు గడుపుతున్నారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు.
 

video game

ఈ కాలంలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్కూల్ హోం వర్క్ పేరుతో పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్లు అలవాటు అయ్యాయి. ఫలితంగా పిల్లలు, టీనేజర్లు ఎక్కువ సమయం ఆన్ లైన్ లోనే గడుపుతున్నారు. చదువుకోవడానికి, పని చేయడానికి ల్యాప్టాప్లు, మొబైల్స్ ను బాగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు చదువుకునేది అయిపోయిన తర్వాత పిల్లలు వీడియో గేమ్స్, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ విషయం కొందరి పేరెంట్స్ కు తెలియకపోయినా.. కొందరు పేరెంట్స్ ఆడుకోనీలే అని పిల్లల్ని వదిలేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వీడియో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఎక్కువసేపు ఆడటం మానసిక క్షోభకు దారితీస్తుంది.


video game addiction

ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగమైన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ప్రకారం.. ఎక్కువసేపు వీడియో గేమ్స్, ఇంటర్నెట్ గేమ్స్ ఆడే పిల్లలు, టీనేజర్లు నియంత్రణ కోల్పోతారు. అలాగే వీళ్లు చెడు అలవాట్ల బారిన పడతారు. 

ఈ గేమింగ్ కు అలవాటు పడిన వారు చెడు అలవాట్ల బారిన పడి చదువు, ఉద్యోగం మానేసి ఎక్కువ సమయం ఆన్లైన్ లోనే సమయం గడుపుతారు. దీంతో వీళ్లు మానసికంగా, శారీరకంగా బలహీనులవుతారని నిపుణులు చెబుతున్నారు.

online games

వీటితో పాటుగా వీడియో గేమ్ ఎక్కువ సేపు ఆడటం వల్ల చిరాకు పెరుగుతుంది. అలాగే ఇతరులకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత పరిశుభ్రతను కూడా మరుస్తారు. ఇవన్నీ గేమింగ్ డిజార్డర్ కు సంకేతాలుగా చెబుతున్నారు నిపుణులు.

ఈ లక్షణాలు ఉన్నవారు రోజుకు 7 నుంచి 8 గంటలు వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. వీళ్లలో.. కోపం, డిప్రెషన్, యాంగ్జైటీ, ఒంటరితనం, అనర్గళంగా మాట్లాడలేకపోవడం, ఆకలి లేకపోవడం, నిద్రలేమి, కళ్లపై ప్రభావం చూపడం, వెన్నునొప్పి, మెడనొప్పి, పనిలో ఏకాగ్రత లోపించడం, వింత ప్రవర్తనలు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలున్న వారిని వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లడం మంచిది. 

ఇంటర్నెట్ గేమింగ్ రుగ్మతలను నియంత్రించాలనుకుంటే వీరికి మానసిక చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ వ్యాధి ఉన్నవారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, గ్రూప్ థెరపీ, ఫార్ములా కౌన్సిలింగ్ వంటి చికిత్సలు చేయించొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. 
 

Latest Videos

click me!