పిల్లలకు రాత్రిపూట జ్వరం వస్తే ఏం చేయాలో తెలుసా?

First Published | Dec 4, 2024, 11:48 AM IST

చాలా సార్లు పిల్లలకు రాత్రిపూటే జ్వరం వస్తుంటుంది. దీనితో తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియదు. రాత్రిపూట పిల్లలకు జ్వరం వస్తే వెంటనే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? 

వాతావరణంలో మార్పులు, వణికించే చల్లని గాలులు, ఒకవైపు వానల వల్ల వైరల్ జ్వరాల బారిన బాగా పడుతున్నారు. ముఖ్యంగా వీటి బారిన ముసలి వాళ్లు, చిన్న పిల్లలే పడతారు. ఎందుకంటే వీరిలోనే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. 

అయితే పిల్లలకు రాత్రిపూటే ఎక్కువగా జ్వరం వస్తుంటుంది. పొద్దున్నే అయితే వెంటనే హాస్పటల్ కు వెళ్లొచ్చు. మరి రాత్రిపూట అంటే హాస్పటల్ కు వెళ్లలేం. దీనివల్ల తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియదు. అందుకే పిల్లలకు రాత్రిపూట జ్వరం వచ్చినప్పుడు వారిని ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


Fever In Children

పిల్లలకు రాత్రిపూట జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? 

రాత్రిపూట 10 గంటల తర్వాత హాస్పటల్స్ వెళ్లడానికి రాదు. కానీ చాలా మంది పిల్లలకు రాత్రిపూటే జ్వరం ఎక్కువగా వస్తుంటుంది. జ్వరం వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అయితే చాలా మంది తల్లిదండ్రులు రాత్రిపూట జ్వరం వచ్చేసరికి భయపడిపోతుంటారు.

ఎందుకంటే పెద్దల మాదిరిగా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు చెమట పట్టదు. అలాగే శరీరం బాగా  వేడెక్కుతుంది. కాబట్టి తల్లిదండ్రులు భయపడుతుంటారు. కానీ ఈ సమయంలో మీరు బయపడటానికి బదులుగా ఒక తడి గుడ్డతో వారి శరీరాన్ని తుడవండి. ఇది బాడీ హీట్ ను తగ్గిస్తుంది. 
 

Fever In Children

మందులు ఇవ్వాలి

జ్వరం వచ్చినప్పుడు తడి గుడ్డతో ఒంటిని తుడిచిన తర్వాత ఇంట్లో ఉన్న జ్వరం మందులను పిల్లలకు ఇవ్వాలి. ఈ జ్వరం 100 డిగ్రీలకు పైగా ఉంటే ఖచ్చితంగా మందులు ఇవ్వాలి. పిల్లలు మందులను వేసుకున్న వెంటనే నిద్రపోతారు. 
 

Fever In Children

హైడ్రేటెడ్ గా ఉండాలి

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వారి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి. పిల్లలకు చెమట పట్టకపోయినా సరే నీళ్లను బాగా తాగించాలి. లేదంటే వారి బాడీ హీట్ బాగా పెరుగుతుంది. వీరి శరీరం గనుక హైడ్రేట్ గా ఉంటే జ్వరం పెరగదు. బాడీ హీట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. 

బట్టల పట్ల శ్రద్ధ

జ్వరం వచ్చింది కదా అని వారికి బరువైన బట్టలను అస్సలు వేయకూడదు. ఎందుకంటే వీటివల్ల వారికి అసౌకర్యం కలుగుతుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు కాటన్ దుస్తులనే వేయాలి. అలాగే చలిపెట్టకుండా ఉండటానికి  స్వెట్టర్లు, జెర్కిన్స్ ను ఖచ్చితంగా వేయాలి. 
 

Fever In Children

తరచుగా మందులు

పై పద్దతులను పాటించినా.. రాత్రంతా వారికి జ్వరం తగ్గకపోయినా, బాడీ టెంపరేచర్ ఏ మాత్రం తగ్గకపోయినా ప్రతి 6 గంటలకోసారి జ్వరం మందులను ఇస్తూ ఉండాలి. అప్పుడే జ్వరం తగ్గుతుంది. అలాగే మందుల ప్రభావం వల్ల నిద్రపోతున్నా పిల్లల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రంతా వారిని కనిపెడుతూ ఉండాలి. అలాగే ఉదయాన్నే హాస్పటల్ కు తీసుకెళ్లాలి.

Latest Videos

click me!