పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Dec 2, 2024, 4:08 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని హాస్టల్ లో చేర్పిస్తున్నారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఎంతో ప్రయత్నిస్తారు. ఎందుకంటే చదువే పిల్లల్ని మంచి మనుషులుగా మారుస్తుంది. వారికి బంగారు భవిష్యత్తును అందిస్తుంది. 

అయితే ఈరోజుల్లో తల్లి, తండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో పిల్లల్ని చిన్న వయసులోనే హాస్టల్ లో చేర్పిస్తున్నారు. ఉద్యోగాలు చేయని వారు కూడా మంచి చదువు అనే పేరుతో హాస్పట్ లో జాయిన్ చేస్తున్నారు. 

కానీ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే పెరగాలి. ఉదయాన్నే పిల్లల్ని నిద్రలేపి  చదివించడం, సమయానికి భోజనం పెట్టడం, స్కూలుకు పంపడం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. చదువుతో పాటుగా మంచి చెడుల గురించి కూడా పిల్లలకు నేర్పించాలి. కానీ హాస్పటల్ లో పెరిగే పిల్లలకు ఇలాంటివేవీ ఉండదు. అసలు పిల్లల్ని హాస్టల్ లో వేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

చాలా వరకు పిల్లల్ని 10, ఇంటర్ అయిపోగానే హాస్టల్ లో వేస్తుంటారు. మార్కులు, జాబ్ అనే ఆలోచనతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని హాస్టల్ లో చేర్పింస్తుంటారు. దీనివల్ల పిల్లలు బాగా చదవుతారని, గొప్ప ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రులు నమ్ముతారు.

కానీ పిల్లల్ని హాస్టల్లో చదివించడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. అవును పిల్లల్ని ఇంట్లోనే పెంచాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు, వారి ప్రవర్తనను చూసి ఎదిగే పిల్లలు వారి కష్టనష్టాలను అర్థం చేసుకుంటారు. అలాగే తల్లిదండ్రులను చూసి మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటారు. మీకు తెలుసా? తల్లిదండ్రుల ప్రేమ, అనురాగంతో పిల్లలు ఎంతో సురక్షితంగా భావిస్తారు. మంచి చెడులు నేర్చుకుంటారు.

Latest Videos


మీకు తెలుసో? తెలియదో కానీ.. ప్రతి పిల్లవాడికీ తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ చాలా చాలా అవసరం. పిల్లలకు ఎప్పుడూ పేరెంట్స్ తో ఉండాలనే కోరిక కలుగుతుంది. అలాగే అప్పుడప్పుడు పేరెంట్స్ తో కలిసి బయటకు వెళ్లొచ్చు అనిపిస్తుంది. దీనివల్ల పేరెంట్స్, పిల్లల మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కానీ హాస్టల్ లో పెరిగే పిల్లలకు ఈ అవకాశం ఉండదు. 

హాస్టల్లో పెరిగే పిల్లలకు చాలా నియమాలు ఉంటాయి. వాళ్ల ఆరోగ్యం బాగా లేకపోయినా.. వారి పనులను వాళ్లే చేసుకోవాలి. భోజనం తినిపించే వారు కూడా ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నట్టుగా భోజనం, తినుబండారాలు హాస్టల్ లో ఏమీ ఉండవు. టైం దాటితే అన్నం కూడా ఉండదు. ఇంట్లో ఉన్న స్వేచ్ఛ హాస్టల్లో అసలే ఉండదు. ఈ విధంగా హాస్టల్ పిల్లలు నియమాలు, నియంత్రణతో బతుకుతారు. దీనివల్ల ఎదిగేపిల్లల వ్యక్తిత్వం మారుతుంది.

ఇంట్లో పెరిగే పిల్లలకు.. హాస్టల్ లో పెరిగే పిల్లలకు మధ్యనున్న ముఖ్యమైన తేడా బయటి ప్రపంచలో జరిగే విషయాలు పూర్తిగా తెలియకపోవడం. హాస్టల్ లో పెరిగే కొంతమందికి అతి కోపంగా, కొంతమంది మృదువుగా ఉంటారు. అయితే ఇంట్లో పెరిగే పిల్లలు జీవన విధానాన్ని బాగా తెలుసుకుంటారు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటారు. 

మీకు తెలుసా? హాస్టల్ లో పెరిగే పిల్లలు చాలా వరకు స్వార్థపరులుగా మారిపోతారు. అలాగే బంధువులతో సంబంధాలు పెద్దగా ఉండవు. అలాగే వారిని గౌరవించాలని కూడా పిల్లలకు ఉండదు. హాస్టల్ లో పెరిగే పిల్లలకు తన గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటుంది. ఇతరుల ఆలోచనలకు, భావాలకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. హాస్టల్స్ పిల్లల వ్యక్తిత్వం, గుణాలను బాగా మార్చేస్తాయి.

హాస్టల్ వల్ల ఇన్ని సమస్యలు వచ్చినా.. తప్పనిసరి పరిస్థితిలో హాస్టల్ లో చేర్పించడం అస్సలు తప్పు కాదు. అయితే ఉంటున్న పరిస్థితులను బట్టి హాస్టల్ లో చేర్పించాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. కానీ హాస్టల్ లో చదివే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తల్లిదండ్రులుగా వారిని మీరే మార్చాలి.

కొన్ని గ్రామాల్లో విద్యా సౌకర్యాలు, మంచి పాఠశాలలు తక్కువగా ఉండొచ్చు. లేదా కొంతమంది విదేశాల్లో లేదా వేరే ఊర్లలో ఉండొచ్చు. అలాగే కొంతమంది ఇంట్లో పిల్లలు పెరగడానికి అవసరమైన మంచి వాతావరణం ఉండకపోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల పిల్లల్ని హాస్టల్లో చేర్పించడం తప్పేమీ కాదు. తప్పనిసరి పరిస్థితిలో పిల్లల్ని హాస్టల్ లో చేర్పించడం మంచిదే. కానీ ఎలాంటి కారణం లేకుండా పేరెంట్స్ తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి పిల్లల్ని హాస్టల్ లో చేర్పించడం అస్సలు మంచిది కాదు. ఇది మీ చేతులారా మీ పిల్లల భవిష్యత్తును చెడగొట్టిన వారు అవుతారు. 

click me!