తమ పిల్లల భవిష్యత్తు అందంగా ఉండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే.. కొందరు పేరెంట్స్ పిల్లలు చిన్న చిన్నవి సాధించినా, మంచి మార్కులు తెచ్చుకున్నా, గేమ్స్ బాగా ఆడినా కూడా మెచ్చుకోరు. ఎక్కువగా మెచ్చుకుంటే.. నెత్తిన ఎక్కి కూర్చుంటారు. సాధించిన విజయం తలకు ఎక్కుతుందని.. పొగడకుండా ఇంకా బాగా ఆడాలి.. బాగా చదవాలి అని చెప్పాలని, అప్పుడే ఇంకా కసితో చదువుతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. అందులో ఏమాత్రం నిజం లేదు. పిల్లలను అప్పుడప్పుడు అయినా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి.
పిల్లలను ఎంకరేజ్ చేస్తూ కొన్ని మాటలు చెప్పడం వల్ల.. వారు లైఫ్ లో మరింత ఉత్సాహంగా ముందుకు వెళతారు. అలా కాకుండా.. వారు ఎంత కష్టపడినా, సాధించినా కూడా.. నిత్యం వారిని నిరుత్సాహపరుస్తూ ఉంటే... వారిలో ఉన్నా కాస్త ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. మరి.. పిల్లలు నిరుత్సాహ పడకుండా ఉండాలంటే.. పేరెంట్స్ నుంచి అప్పడప్పుడు అయినా కొన్ని మాటలు వింటూ ఉండాలి. మరి, అవేంటో ఓసారి చూద్దాం..
parents crying
చాలా మంది పేరెంట్స్ కి తెలియని విషయం ఏమిటంటే.. తమ పిల్లలల్లో కాన్ఫిడెన్స్ నింపాలన్నా... వారు ఎందులో ముందుకు దూసుకోవాలన్నా... వారితో ఆపని చేయించగల సత్తా కేవలం వారి పేరెంట్స్ లోనే ఉంది.
Parenting Tips-Things parents should do before disciplining children
పిల్లలకు సంబంధించిన విషయం ఏదైనా, ఆట లో అయినా, చదువులో అయినా వారు ఏదైనా సాధించినప్పుడు వెంటనే ప్రశించాలి. వావ్ , సూపర్ అని వారిని మెచ్చుకోవాలి. ఒకవేళ వాళ్లు సాధించలేకపోయినంత మాత్రాన...నీకు ఏమీ రాదు.. చదవులేవు, ఆడలేవు.. డ్యాన్స్ కూడా వేయడం రాదు ఇలాంటి మాటలు వాడకూడదు. వారు పడిన కష్టాన్ని మెచ్చుకోవాలి. వారి ఎఫర్ట్స్ ని కూడా మెచ్చుకోవాలి. అప్పుడు వారిలో ఉత్సాహం పెరిగి.. మరోసారి గెలవడానికి ప్రయత్నిస్తారు.
Parenting Tips- T
పిల్లలు అల్లరి చేయడం, గొడవ చేయడం చాలా కామన్. అయితే... ఆ విషయాన్ని చూపించి.. పిల్లలు మాట వినని ప్రతిసారీ.. నువ్వు అసలు నాకు పుట్టకపోయినా బాగుండేది, అందరు పిల్లలు బాగున్నారు.. నా పిల్లలే ఇల ఉన్నారు లాంటి మాటలు అంటూ ఉంటారు. ఆ మాటలు పసి హృదాయాలను గాయం చేస్తాయి. కాబట్టి.. వీలైనంత వరకు అలాంటి మాటలు అనకండి.. దానికి బదులు.. వారు ఎంత అల్లరి చేసినా కూడా.. మీరు వారి లైఫ్ లో జరిగిన గొప్ప విషయం అని, మీ లైఫ్ లో వాళ్లు ఉండటం చాలా సంతోషపడే విషయమనే మాటకూడా వారికి చెప్పాలి.
ప్రతి విషయంలో పిల్లలకు పేరెంట్స్ మేం ఉన్నాం అనే నమ్మకం కలిగించాలి.. వారు ఏదైనా విషయంలో భయపడినప్పుడు.. మేం ఉన్నాం అనే ధైర్యం వారికి అందించాలి. ఈ మాటలు పిల్లల్లో ధైర్యం పెంచడంతో పాటు, వారిలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. వారు ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా.. తమకు పేరెంట్స్ ఉన్నారనే ధైర్యం వారిని ముందుకు నడిపిస్తుంది.
Parenting Tips
పిల్లలపై అన్ కండిషనల్ లవ్ చూపించాలి. నువ్వు నా మాట వింటేనే నాకు నీ మీద లవ్ ఉంటుంది.. ఇలా మీరు పిల్లలపై చూపించే ప్రేమ విషయంలో కండిషన్స్ పెట్టకూడదు. వారు ఏం చేసినా, చేయకపోయినా వారిపై అన్ కండిషనల్ ప్రేమను చూపించాలి. అప్పుడే.. వారు తమకు నిజమైన ప్రేమ లభిస్తుందని అనుకుంటారు. లేకపోతే.. వారిలో ఎప్పుడూ ఏదో ఒక తెలియని లోతు ఉంటుంది.