పేరెంట్స్ ను చూసి పిల్లలు ఈ విషయాలు నేర్చుకుంటారు..

First Published Feb 11, 2024, 12:37 PM IST

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి అలవాట్లను నేర్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇతరులతో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? మొదలైన ఎన్నో విషయాలను నేర్పుతుంటారు. కానీ తల్లిదండ్రులు తమకు తెలియకుండా పిల్లలకు కొన్ని నేర్పుతారు. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

తల్లిదండ్రుల పెంపకం పైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ప్రతి పేరెంట్ తమ పిల్లలు బుద్దిగా, మంచి ఆలోచనలతో ఉండాలని కోరుకుంటారు. అలాగే వారి ప్రవర్తనను మంచిగా ఉంచడానికి తల్లిదండ్రులుగా వారు చేయాల్సిన ప్రతి దాన్ని చేస్తుంటారు. కానీ పిల్లలు మీకు తెలియకుండానే.. మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు తెలుసా? మీరు మీ పిల్లల ముందు ఎంత నియంత్రణగా ఉన్నా.. ప్రతీ క్షణం పిల్లలు మిమ్మల్నే గమనిస్తారు. మీ అలవాట్లను జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు ఏదో ఒక సమయంలో మీలాగే ప్రవరిస్తాడు. మీరు చేసిన దానిని అనుసరిస్తారు కూడా. తల్లిదండ్రులే పిల్లల మొదటి గురువు. కాబట్టి మీ పిల్లలు మీ నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మన భావోద్వేగాలను మనం ఎలా హ్యాండిల్ చేస్తాం

ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. మనం భయపడుతున్నామా? లేదా లైట్ తీసుకుంటున్నామా? సహనంతో సమస్యలను పరిష్కరిస్తున్నామా? అనే విషయాలను పిల్లలు బాగా గమనిస్తారు. మీ పరిస్థితిని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 
 

పని పట్ల సూత్రాలు, నియమాలు, బాధ్యత

ఒక పనిని మీరు ఎలా చేస్తున్నారనే విషయాన్ని కూడా పిల్లలు బాగా గమనిస్తారు. అలాగే పని పట్ల మీకున్న విధేయత, అంకితభావాన్ని చూసి.. వారు కూడా ఆ పనిని అదే విధంగా చేయాలనే ప్రయత్నిస్తారు. 

కుటుంబంతో ఎలా ఉంటున్నాము

మీరు మీ భాగస్వామితో ఎలా  ప్రవర్తిస్తారు? జీవిస్తున్నారు? మీ పెద్దలను మీరు ఎలా గౌరవిస్తారో? మీ పిల్లలకు మీరు ఎంత గౌరవం ఇస్తున్నారు? వంటి విషయాలను కూడా పిల్లవాడు గమనిస్తారు. వీటిని చూస్తూ పెరిగిన పిల్లలు మీలాగే తయారవుతారు. 
 

జంతువులతో ఎలా ప్రవర్తిస్తాం

పేరెంట్స్ జంతువులను ఎలా చూస్తారు?అంటే ఆటపట్టిస్తున్నారా? ప్రేమతో చూస్తున్నారా? ? వంటి మీ ప్రతి మూమెంట్ ను వారు గమనిస్తారు. కాబట్టి మూగ జీవాల పట్ల ప్రేమగా ఉండండి. మీ పిల్లలు కూడా వాటిని ప్రేమగా చూడటం మొదలుపెడతారు. 

పర్యావరణం పట్ల మనం ఎలా ఉన్నాం

పువ్వులు కోయొద్దు, మొక్కలను, చెట్లను నరికేయొద్దు వంటి విషయాలను పిల్లలకు చెప్పండి. అలాగే మీ పిల్లలను ముందు అలాగే ఉండండి. అలాగే పక్షులకు గింజలను వేసి నీళ్లను పోయండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.
 

మనీ మేనేజ్ మెంట్

పిల్లల ముందు అతిగా ప్రవర్తించకండి. లేకపోతే వారు ప్రతి దానికీ డబ్బు అడిగే తప్పుడు అలవాటు బారిన కూడా పడతారు. అలాగే మీ పిల్లలకు డబ్బు విలువను తెలియజేయండి. 

సమయాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం

పనికి, కుటుంబానికి, సమాజానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో కూడా మీ పిల్లలు గమనిస్తారు. వారు కూడా మీలాగే ప్రవర్తిస్తారు. 

Parenting

సమాజంలో, కుటుంబంలో మనం ఎలా ప్రవర్తిస్తాం

బయటి వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? కొంత మందితో ఎలా లాంఛనంగా ఉండాలి? ఇంట్లో వారితో ఎలా ఉండాలన్న విషయాలను కూడా మీకు తెలియకుండానే మీ పిల్లలకు నేర్పుతారు. 

click me!