ఒక వయసు వచ్చే వరకు పిల్లలకు విపరీతమైన కోపం ఉంటుంది. ఆ సమయంలో.. వారికి కోపం ఎందుకు వచ్చింది..? వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కనుక పేరెంట్స్ గమనిస్తే.. పిల్లల్లో కోపాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. అప్పుడు.. పిల్లలు ఎవరితోనూ గొడవ పడకుండా ఉంటారు.
పిల్లలు ఇద్దరు ఏదైనా బొమ్మ కోసం గొడవపడుతున్నారు అంటే.. ఆ వస్తువును వదులుకోవడం ఇద్దరికీ ఇష్టం లేదని అర్థం. దాని వల్లే ఇద్దరూ అదే కావాలి అని గొడవపడతారు. అందుకే.. ఒక వయసు వచ్చేసరికి మనం పిల్లలకు అన్నీ మనకు కావాల్సిన కోరుకోవడమే కాదు.. కొన్ని ఎదుటివారికి ఇచ్చేయడంలోనూ సంతోషం ఉంటుందని నేర్పించాలి. అప్పుడు గొడవలు రాకుండా ఉంటాయి.