పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు ఇలా మాత్రం చేయకండి

Published : Aug 22, 2025, 07:17 PM IST

పిల్లల్ని సమయానికి నిద్రలేపి వారిని రెడీ చేయడం తల్లిదండ్రులకు పెద్ద టాస్కే. కానీ ఈ ప్రాసెస్ పోల పడి తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లల మనసును పాడు చేస్తాయి తెలుసా?

PREV
15
పిల్లల స్కూల్

సాధారణంగా పిల్లలు ఉదయం 7 నుంచి 8 గంటలకు స్కూలుకు బయలుదేరుతుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని తొందరగా నిద్రలేపి రెడీ చేస్తుంటారు. చాలామంది పిల్లలు ఉదయాన్నే టైం లేక బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. దీనికి తోడు పిల్లలు హోం వర్క్ చేసుకున్న పుస్తకాలను బ్యాగ్ లో పెట్టుకోరు. 

ఇంకోవైపు పేరెంట్స్ కు ఆఫీస్ టైం అవుతుంది. అలాగే స్కూల్ టైం కూడా అవుతుంటుంది. ఇదంతా తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తుంది. అందుకే పిల్లలపై అరుస్తుంటారు. ఇది కూడా చేసుకోలేవా? అని. కానీ ఇది మాటల్లో చెప్పడం చాలా సులువు. 

కానీ మీరు పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు చేసే కొన్ని తప్పులు మీ పిల్లల మనసుల్ని బాధపెడతాయి. అలాగే వారి రోజును పాడు చేస్తాయి. అందుకే పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
హడావిడి వద్దు

పిల్లల్ని స్కూలుకు పంపడం తల్లిదండ్రులకు ఒత్తిడిని కలిగిస్తుంది. త్వరగా రెడీ అవ్వండి. త్వరగా తినండి, ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు అని పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తుంటారు. ఇది ప్రతి పేరెంట్ చేసే సర్వ సాధారణమైన తప్పు. కానీ ఇది మీ పిల్లల్లో స్ట్రెస్ ను కలిగిస్తుంది.

 ఈ తప్పు వల్ల మీ పిల్లలు చదువుపై ఇంట్రెస్ పెట్టలేక బాగా ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల మీ పిల్లలు స్టడీపై ఇంట్రెస్ట్ పెట్టడానికి బదులుగా మీరన్న మాటలమీదే మనస్సును పెడతారు. అందుకే ఇలాంటి తప్పు చేయకుండా రాత్రిపూటే ఉదయం వారు తొందరగా స్కూలుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోండి. అంటే వారి స్కూల్ బ్యాగ్ సర్దడం, యూనిఫాం ను రెడీ చేయడం లాంటివి చేయండి. దీనివల్ల మీకు ఎలాంటి హడావిడి ఉండదు.

35
బలవంతంగా బ్రేక్ ఫాస్ట్ ను తినిపించడం, లేదా స్కిప్ చేయడం

పిల్లలు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం లేదా బలవంతంగా వారికి తినిపించడం రెండూ మంచివి కావు. చాలా మంది స్కూలుకు లేట్ అవుతుందని బ్రేక్ ఫాస్ట్ తినిపించకుండానే స్కూలుకు పంపిస్తుంటారు. కానీ ఇలా తినకుండా స్కూలుకు వెళితే వారి ఒంట్లో శక్తి ఉండదు. దీనివల్ల మీ పిల్లలకు చదువుపై ఆసక్తి ఉండదు. 

అలాగే బాగా చిరాకు పడతారు. అలాగని మీరు బలవంతంగా తినిపిస్తే వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మీ పిల్లలు ఇష్టంగా తినే తేలికపాటి బ్రేక్ ఫాస్ట్ ను చేయండి. ఒకవేళ తినడానికి ఇష్టపడకపోతే ప్రేమతో తినమని చెప్పండి.

45
చదువుకోమని ఒత్తిడి

పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు చాలా మంది పేరెంట్స్ పిల్లలకు క్లాస్ పీకుతుంటారు. అంటే టీచర్ చెప్పిన దాన్ని శ్రద్ధగా వినాలి, పరీక్షలు బాగా రాయాలి అంటూ ప్రతిదానిపై ఒత్తిడి తెస్తుంటారు. 

దీనివల్ల చదువుపై వారికి స్ట్రెస్ కలుగుతుంది. దీనివల్ల పిల్లలు నేర్చుకోవడానికి బదులుగా చదువంటే విసుగు వస్తుంది. ఇలాంటి సమస్య ఎదురుకావొద్దంటే ఈ రోజు నువ్వేం నేర్చుకున్నావో ఇంటికొచ్చాక నాకు చెప్పండి అని చెప్పాలి. ఇవి వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

55
వేరే పిల్లల్తో పోల్చడం

చాలా మంది పేరెంట్స్ ఈ తప్పును ఎక్కువగా చేస్తారు. నీ ఫ్రెండ్ ఎంత పొద్దున లేచి రెడీ అయ్యాడో చూడు, నీ ఫ్రెండ్ లా నువ్వెందుకు చదవవు, ఆమె చూడు ఎంత డీసెంట్ గా ఉంటుందో అంటూ మీ పిల్లల్ని ఇతర పిల్లల్తో పోల్చకండి. ఇది మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అలాగే వారంటే అసూయ కలిగేలా చేస్తుంది. ఇది ఎదురుకావొద్దంటే మీ బిడ్డను స్పెషల్ గా చూడండి. వారి చిన్న చిన్న విజయాలను అభినందించడం నేర్చుకోండి. ప్రశంసించండి.

అబద్ధాలు చెప్పడం, భయపెట్టడం

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను భయపెట్టి లేదా అబద్దాలు చెప్పి స్కూలుకు వెళ్లేలా చేస్తుంటారు. అంటే మీ టీచర్ తిడుతుంది తొందరగా స్కూలుకు వెళ్లండి, నీకు ఐస్ క్రీ ఇప్పిస్తా అంటూ ప్రతిరోజూ ఏదో ఒక అబద్దాన్ని చెప్తుంటారు. కానీ ఇలా మీరు అబద్దాలు చెప్తే మీపై పిల్లలకు నమ్మకం పోతుంది. అలాగే బెదిరించడం వల్ల పిల్లలకు స్కూలంటే భయం కలుగుతుంది. అందుకే మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే భయంతో, అబద్దాలతోనే కాకుండా ప్రేమతో స్కూలుకు పంపండి. ఓపికగా అన్నీ చెప్పండి.

Read more Photos on
click me!

Recommended Stories