పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఈ పనులు మాత్రం చేయొద్దు..

First Published | Apr 4, 2024, 11:51 AM IST

పిల్లలు చాలా సున్నితమైన మనస్కులు. తల్లిదండ్రులు చెప్పే కొన్ని మాటలు పిల్లల మెదడులో నాటుకుపోతాయి. అవి వారు పెద్దవారైనా అలాగే ఉంటాయి. వీటి గురించే వారి ఆలోచన ఉంటుంది. అందుకే పిల్లలు నిద్రపోతున్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో కొన్ని మాటలు అనకూడదు. అవేంటంటే? 
 

పిల్లల పెంపకం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు దేని కోసం ఏడుస్తున్నారు? ఎప్పుడు ఏడుస్తారు? వాళ్లకు కోపమెందుకు వస్తుందో తల్లిదండ్రులకు అంత సులువుగా అర్థం కాదు. కానీ ప్రయత్నిస్తే సులువుగా వారి భావాలను తెలుసుకోవచ్చు. మీరు మీ పిల్లల్ని ప్రతిరోజూ జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ.. వారి చుట్టూ ఉన్న వాతావరణం వారి మనస్తత్వాన్ని మార్చేస్తుంది.
 

parenting

పిల్లలను తెలివైన వారిగా, మంచివారిగా,  ప్రతిభావంతులను చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఇదంతా కావాలంటే మాత్రం మీ పిల్లలు  పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలి. ఇందుకోసం వారు బాగా నిద్రపోవాలి. అయితే ప్రస్తుత కాలంలో పెద్దలతో పాటుగా పిల్లలు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు.  ఒత్తిడి, ఆందోళన, భయం, నిరాశలే పిల్లల్ని నిద్రకు దూరం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. 
 


toxic parenting


పిల్లలను నిద్రపోయేలా చేయడం కష్టం

పిల్లలు ఎంత సేపైనా అలసట లేకుండా ఆడుకుంటారు. కానీ నిద్రమాత్రం పోరు. నిద్రపోదామని చెప్తే కొంతమంది పిల్లలు బయటకు వెళుతుంటారు. వాళ్లను పడుకోబెడట్టడానికి తల్లిదండ్రులు ఎంతో తిప్పలు పడుతుంటారు. దీనివల్ల తల్లిదండ్రులు నిద్రపోవడమే కానీ.. పిల్లలు మాత్రం పడుకోరు. ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో జరిగే ఎంతో సాధారణ విషయం. పిల్లల్ని నిద్రపోయేలా చేయడానికి ఎన్నో కథలు చెప్తుంటారు. పాటలు పాడుతంటారు. లేదా వారితో జోలి పెడుతుంటారు. ఇది మంచి విషయమే. అయితే పిల్లలను పడుకోబెట్టేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దెయ్యం కథలు 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను నిద్రపుచ్చడానికి గంటల తరబడి కష్టపడుతుంటారు. అయితే ఎంతకీ పిల్లలు నిద్రపోవడం లేదని ,వారిని భయపెడితే నిద్రలోకి జారుకుంటారని భావించి దెయ్యాల కథలు చెబుతుంటారు. కానీ దెయ్యాల కలల వల్ల పిల్లలకు నిద్ర అసలే రాదు. అలాగే దీనివల్ల వాళ్లకు తమ దగ్గరకు దెయ్యం వస్తుందని భయపడుతుంటారు. అందుకే పిల్లలకు ఎట్టి పరిస్థితిలో దెయ్యాల కథలను మాత్రం చెప్పకూడదు. 

కోపం తెప్పించే విషయాల గురించి మాట్లాడవద్దు

పిల్లలు నిద్రపోనంత మాత్రాన వారికి ఏదో ఒకటి చెప్పాలని మాత్రం అనుకోకండి. ముఖ్యంగా పిల్లల్ని ఒత్తిడి, దుఃఖానికి దారితీసే విషయాల గురించి అసలే మాట్లాడకండి. పడకగదిలో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవి కావు. మరుసటి రోజు మీ పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఇలా మాత్రం చేయకండి. 
 

ఇతరులతో పోలిక

పిల్లలు స్కూల్, ఇంటి దగ్గర జరిగిన ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు. దీంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ పిల్లలను ఇతరులతో పోల్చడం మానుకోండి. ఆ అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చాడు నువ్వేం చేయడానికి ఉన్నావ్ అని చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతుంటారు. ఇది మంచి పద్దతి కాదు. పిల్లల్ని ఇతరులతో పోల్చితే ఇది మీ పిల్లల ఎదుగుదలను బాగా ప్రభావితం చేస్తుంది.


ఏం చేయబోతున్నావ్..

పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నావు? అని మాత్రం అడగకండి. నిద్రపోతున్నప్పుడు వినే మాటలు ఇవి కావు. ఆ ప్రశ్న అడగటానికి ఇది సరైన సమయం కూడా కాదు. అలాగే పిల్లలతో కోపంగా ఏం మాట్లాడకూడదు. ఇవన్నీ పాటిస్తే మీ బిడ్డ ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు.

Latest Videos

click me!