పిల్లల ఎదుగుదలపై ప్రభావం
పిల్లలకు అన్నీ నిజాలే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇవి పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నమ్ముతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి హాని చేయని అబద్దాలను చెప్పేస్తుంటారు. వీటివల్ల పెద్దగా నష్టపోయేదేమీ లేదని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ హానిచేయని ఈ అబద్ధాలు పిల్లల భావోద్వేగ, మానసిక ఎదుగుదలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు-పిల్లల సంబంధాలపై నమ్మకం సన్నగిల్లుతుంది
పిల్లలు తమ తల్లిదండ్రులను పిల్లలు బాగా నమ్ముతారు. ఎందుకంటే ఎప్పుడూ తల్లిదండ్రులే పిల్లలతోనే ఉంటారు. వారికి లోకం పోకడ గురించి చెప్తారు. జ్ఞానం, మార్గదర్శకత్వం చేస్తారు. అందుకే మా అమ్మానాన్నలు చెప్పేది నిజమని నమ్ముతారు. కానీ పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ వారి తల్లిదండ్రులు చెప్పింది నిజాలు కాదని తెలిసిపోతుంది. దీనివల్ల నిజాయితీగా లేని తల్లిదండ్రులపై పిల్లలకు నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్నవయసులోనే పిల్లలతో నమ్మకం అనే పునాదిని ఏర్పాటు చేయడానికి ఎక్కువ విలునివ్వాలి. ఇదే వారు మీ నుంచి నేర్చుకుంటారు. కానీ ఎప్పుడూ ఎప్పుడూ అబద్దాలు చెప్పుకుంటూ పోతే ఈ ఈ పునాది దెబ్బతింటుంది. అలాగే పిల్లలు పెద్దయ్యాక కమ్యూనికేషన్ సమస్యలు, సంబంధాలు దెబ్బతింటాయి.
చిన్న చిన్న అబద్ధాల ప్రభావం
చిన్న అబద్ధాలు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు అని అనిపించనప్పటికీ.. ఇవి ఒక పిల్లవాడు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడనే దానిపై పెద్ద ప్రభావాన్నే చూపుతాయంటారు నిపుణులు. ఉదాహరణకు.. శాంటాక్లాజ్ తాత వచ్చి క్రిస్మస్ రోజున గిఫ్ట్ లు ఇస్తారని చెప్తుంటారు. కానీ ఆ రోజు శాంటాక్లాజ్ తాత రాక.. వారికి గిఫ్ట్ లు ఇవ్వకపోవడంతో వారు నిరుత్సాహానికి గురవుతారు. అలాగే ఈ మాటలు చెప్పిన తల్లిదండ్రులను కూడా పిల్లవాడు నమ్మకుండా మారుతాడు. అంటే మీరు చెప్పిన ప్రతి విషయం అబద్దాలే అని అనుకునే అవకాశం ఉంది. అందుకే పిల్లలకు ఆశలను కలిగించే అబద్దాలను తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడూ చెప్పకూడదు.
నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్
పిల్లలతో నిజాయితీగా మాట్లాడటం వల్ల వారు మిమ్మల్ని నమ్ముతారు. అలాగే నైతిక ప్రవర్తన కూడా బాగుంటుంది. నిజాయతీని మోడలింగ్ చేసే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. చేసే పనులు, నిర్ణయాల గురించి నిజాయితీగా ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలలో సమగ్రత భావాన్ని పెంపొందించవచ్చు. సమస్య పరిష్కారం,నిర్ణయం తీసుకోవడానికి ఆరోగ్యకరమైన విధానాన్ని క్రియేట్ చేయొచ్చు.
కమ్యూనికేషన్, అవగాహనను ప్రోత్సహించడం
తల్లిదండ్రులు పిల్లలను మోసం చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అలాగే ఒత్తిడి, యాంగ్జైటీ వంటి సమస్యలను పిల్లలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడానికి ప్రోత్సహించాలి. పిల్లలను ప్రశ్నలు అడగాలి. వారికి నిర్మొహమాటమైన, వయస్సుకు తగినట్టుగా ప్రతిస్పందిస్తే మీరు నమ్మకానికి పునాది వేయొచ్చు. పిల్లలు చేసే మంచి పనులకు అభినందించండి. అలాగే వారి ఆలోచనలు, ఆందోళనలను పంచుకోవడానికి వారు సౌకర్యవంతంగా భావించే వాతావరణాన్ని సృష్టించడానికి వారి భావోద్వేగాలను గుర్తించండి.