పిల్లలకు చిన్న వయసులోనే ఈ విషయాలు నేర్పించాలి.. లేదంటే తర్వాత బాధపడతారు

First Published | Oct 5, 2024, 1:43 PM IST

ప్రతి పేరెంట్స్ కు పిల్లల పెంకకమేనేది చాలా పెద్ద బాధ్యత. దీనిలో పిల్లల్ని కేవలం పెంచడమొక్కటే కాదు వాళ్లను మంచి వ్యక్తులుగా, పౌరులుగా తీర్చిదిద్దడం కూడా ఉంది. మీ పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదగాలంటే మాత్రం ప్రతి పేరెంట్స్ పిల్లలకు చిన్న వయసులోనే కొన్ని విషయాలను చెప్పాలి. అవేంటంటే..

parenting

ప్రతి ఒక్క తల్లిదండ్రులపైన పిల్లల మంచి భవిష్యత్తుకు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉంది. వీటిలో ముఖ్యమైనవి వాళ్లకు ప్రాథమిక మర్యాదలను నేర్పించడం. ఇతరులతో మర్యాదక, సానుకూలంగా మాట్లాడటం ఉన్నాయి. అంతేకాదు ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం కూడా ఉంది.

ఇవి మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని బాగా పెంచుతాయి. అందుకే పిల్లల బంగారు భవిష్యత్తుకు, మంచి పౌరులుగా ఎదిగేందుకు పిల్లలకు చిన్న వయసులో ప్రతి తల్లిదండ్రులు ఎలాంటి విషయాలను నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్లీజ్, థాంక్స్ 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖచ్చితంగా "ప్లీజ్",  "థాంక్స్" అని చెప్పడం నేర్పించాలి. ఇవి మర్యాద పదాలు. ఈ పదాలు మీరు ఇతరులకు సహాయం చేసినందుకు, వారి అభిప్రాయలకు విలువ ఇస్తున్నారనడాన్ని చూపిస్తుంది.

మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడల్లా "ప్లీజ్" అని చెప్పడం నేర్పించండి. అలాగే ఎవరికైనా సహాయం చేయడం, లేదా పిల్లలు ఎవరి సహాయమైనా తీసుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేయండి. 

ఇతరులను గౌరవించడం

చాలా  మంది తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ గారాభం పెడుతుంటారు. దీంతో పిల్లలు మొండిగా తయారవుతారు. అలాగే ఇతరులతో ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. చిన్న వయసులో బానే అనిపించినా.. పెద్దయ్యాక మీ పిల్లలతో పాటుగా మిమ్మల్ని కూడా తిట్టుకుంటారు.

అందుకే పిల్లలకు ఇతరులను గౌరవించడం నేర్పించండి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి భిన్నంగా ఉంటాడని, వారి ఆలోచనలు, భావాలు వేరుగా ఉంటాయన్న సంగతిని కూడా చెప్పండి. అలాగే ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, వారితో మర్యాదగా మాట్లాడటం, నడుచుకోవడం ఖచ్చితంగా నేర్పండి.
 


క్షమాపణలు చెప్పడం

ప్రతి మనిషి తప్పు చేస్తాడు. ఇది చాలా కామన్. ఇది మనిషి లక్షణం కూడా. కానీ ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇకపోతే మీ పిల్లలు ఏవైనా తప్పులు చేసినప్పుడు క్షమాపణలు చెప్పడం నేర్పించాలి. అలాగే ఇతరులకు క్షమాపణ చెప్పడానికి మంచి మార్గం ఏంటో కూడా వారికి చెప్పండి. 

సమయపాలన పాటించడం

సమయ పాలన ప్రతి ఒక్కరికీ అవసరం. సమయపాలనను పాటించకపోతే మీరు జీవితంలో ఎన్నో కోల్పోతారు. కాబట్టి మీ పిల్లలు సమయపాలన పాటించేలా చేయండి. ఇందుకోసం సమయం విలువను, ప్రాముఖ్యతను వారికి వివరించండి. సమయానికి రావడం ఎంత ముఖ్యమో, ఆలస్యంగా రావడం వల్ల ఇతరుల సమయం ఎంత వృధా అవుతుందో వారికి నేర్పండి. 
 

ఇతరులకు సహాయం చేయడం

ఇతరులకు సహాయపడటం మంచి లక్షణం. ఇదే అసలైన మర్యాద. అందుకే ఇతరులకు సహాయంలో చేయడంలో వచ్చే ఆనందాన్ని అనుభవించాలంటే మీ పిల్లలకు ఇది నేర్పండి. చిన్న చిన్న విషయాలు కూడా ఒకరికి ఎంతో ఉపయోగపడతాయని మీ పిల్లలకి చెప్పండి. పిల్లలకు ఈ విషయాలను చిన్నప్పటి నుంచే నేర్పితే పెద్దయ్యాక వారు మంచి వ్యక్తులుగా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. తల్లిదండ్రులుగా మీ గౌరవం కూడా పెరుగుగుతుంది.  

బంధువుల ముందు పిల్లల్ని తిడితే ఏమౌతుంది?

పిల్లలు మొండిగా అవుతారు: తప్పు చేశారాని పిల్లల్ని బంధువుల ముందు తిడితే మీ పిల్లలు మొండిగా మారుతారు. ఈ తిట్ల వల్ల మీ పిల్లలు అస్సలు మారరు. పైగా అంతకు మించి చేస్తారు. మీకు తెలుసా? పేరెంట్స్ పిల్లల్ని బయటివ్యక్తుల ముందు తిడితే మీ పిల్లల మనసుపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ పిల్లలకు కోపం ఎక్కువగా రాదు. అలాగు మరింత మొండిగా బిహేవ్ చేస్తారు. అంతేకాదు మీతో వాధనకు దిగడానికి అస్సలు వెనకాడరు.


ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది:  పిల్లల్ని అందరిముందు తిడితే వారి మనసుపైనే కాదు.. శరీరంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. అంటే ఇది మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. తల్లిదండ్రుల తిట్లు పిల్లల్ని శారీరకంగా వీక్ గా చేస్తాయి. మీ తిట్లతో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతారు.

దీంతో వారి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇంకేముంది మీ పిల్లలకు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. దీనివల్ల వారి శారీరక ఎదుగుదల కూడా తగ్గుతుంది. 

చదువు నాశనం:  చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలు ఒత్తిడికి గురవుతారన్న ముచ్చట కూడా తెలియదు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. స్కూల్ లో సమస్యలు, ఫ్రెండ్స్ తో గొడవలు, ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఇలా ఎన్నో ఉండొచ్చు.

ఇలాంటి పరిస్థితిలో మీరు పిల్లల్ని తిడిగే వారి ఒత్తిడి మరింత పెరుగుతుంది. దీంతో వారికి చదువుపై ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకేముంది మీ పిల్లలు చదువులో వెనకబడతారు. 

Latest Videos

click me!